Advertisement
Google Ads BL

ప్రియదర్శిలో ఇంత ప్రేముందా..?


ప్రస్తుతం ఎంతటి సెలబ్రిటీలైనా సోషల్‌మీడియా ద్వారా తమ మనోభావాలను, అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీనివల్ల తాము లక్షల మందికి చేరువ అవుతామనే పాయింట్‌ ఆధారంగానే వీరు సోషల్‌ మీడియాకి ఎంతో విలువ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం న్యూజనరేషన్‌ కమెడియన్లలో ప్రియదర్శిది సపరేట్‌ స్టైల్‌. ఆయన 'పెళ్లిచూపులు' చిత్రంలో తనదైన శైలిలో డైలాగ్‌ మాడ్యులేషన్‌, బాడీలాంగ్వేజ్‌తో 'నా చావు నేను చస్తా' అని అందరి మనసులను చూరగొన్నాడు. ఆ తర్వాత ఏకంగా మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'స్పైడర్‌'లో నటించాడు. తాజాగా 'తొలిప్రేమ'తో మరింతగా తన కెరీర్‌ని స్ట్రాంగ్‌ చేసుకున్నాడు. ఈయన త్వరలో రిచా శర్మ అనే యువతిని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ప్రేమికుల రోజుకు ఒకరోజు ముందు తన ప్రేయసి ఫొటోని పోస్ట్‌ చేసి, ఆమె బర్త్‌డే సందర్భంగా ఎంతో అందంగా, కవితాత్మకంగా తన ప్రేమని తెలిపి, వాలంటైన్స్‌డే ఫీవర్‌ని పీక్స్‌కి తీసుకెళ్లాడు. ఈనెల 23న వీరిద్దరి వివాహం హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం. అయితే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఇక ఈయన తన ప్రేయసితో కూడిన ఫొటోని పోస్ట్‌ చేస్తూ, డియర్‌ లవ్‌, నా ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని పదాలుగా రాయాలనుకుని విఫలమయ్యాను. నీ అందమైన హృదయం వర్ణించాలంటే ఖచ్చితంగా లక్షల కొద్ది పదాలు, పద్యాలు కావాలి. అయినా ప్రతిరోజు, ప్రతిక్షణం ఆ ప్రయత్నం చేస్తూనేఉంటా. అంతకు మించి ఏమీ చేయలేను. 

నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చిన విధికి నా ధన్యవాదాలు. స్నేహాన్ని, ప్రేమను కలిపి జరుపుకుందాం. ప్రేమకు నిర్వచనంగా నిలుద్దాం. హ్యాపీ బర్త్‌డే రిచా. మై డార్లింగ్‌ వాలంటైన్‌. లవ్‌ టు ది మూన్‌ అండ్‌ బ్యాక్‌.. అంటూ ప్రేమలేఖ రాసి కవిత్వం రాయడం రాదని చెబుతూనే తన ప్రేయసి, కాబోయే శ్రీమతికి తనదైన భావావేశంతో చేసిన పోస్ట్‌ బాగా వైరల్‌ అవుతోంది.

Growing Comedian Valentine Proposal!:

Priyadarshi Valentine Wish For To Be Wife Richa Sharma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs