Advertisement
Google Ads BL

వామ్మో.. ప్రియా ప్రకాష్ వారియర్ కి అంతా!


గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. మలయాళం నుండి రాకెట్ లా  దూసుకొచ్చిన సాయి పల్లవిని మరవక ముందు ఇప్పుడు తాజాగా బుల్లెట్ లా మరో అమ్మాయి దూసుకొచ్చింది. ఫేస్ బుక్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఇన్ స్ట్రాగ్రామ్ చూసినా ఇలా ఎక్కడ చూసినా 'ఓరు ఆధార్ లవ్' హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించే. ఒకే ఒక్క టీజర్ తోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రస్తుతం తెగ సెర్చింగ్ జరుగుతోంది. ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ ఇంకా విడుదల కాకూండానే ఈ మలయాళీ ముద్దుగుమ్మకు ఆఫర్స్ వెలువలా వచ్చిపడుతున్నాయి. మరి అందం టాలెంట్ ఎక్కడుంటే అక్కడ దర్శక నిర్మాతలు వాలిపోతారని తెలిసిన విషయమే.

Advertisement
CJ Advs

ప్రియా ప్రకాష్ ఫేస్ ఎక్సప్రెషన్స్, కళ్లల్లో కదిలించే హావభావాలు టాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం పడిపోయారు. మరి అలాంటి అమ్మాయి తన పక్కన నటించాలని ఏ హీరో కోరుకోడు. అవకాశం ఉంటే ఆ అమ్మాయితో నటింపచేయాలని చాలామందే డిసైడ్ అయ్యారు. కానీ మొదటగా ప్రియా ప్రకాష్ వారియర్ ని గాలం వేసి పట్టేసింది మాత్రం టాలీవుడ్ కుర్ర హీరో నిఖిల్ అంటున్నారు. నిఖిల్, పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం ప్రియా ప్రకాష్ వారియర్ ని ఎంపిక చేశారనే టాక్ నడుస్తుంది. మరి ఈ సినిమా కథకి తగ్గ హీరోయిన్ ప్రియానే అని నిఖిల్ అండ్ కో డిసైడ్ అవడమే తరువాయి ఆమె అడ్రెస్స్ పట్టుకుని ఆమె దగ్గరికి వెళ్లారట.

మరి ప్రియా ప్రకాష్ ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతుందామె. అందుకే ఈ పిల్ల డేట్స్ చూస్తున్న ఆమె మొదటి సిఎం మా డైరెక్టర్ అయినా.... ఓరు ఆధార్ లవ్ డైరెక్టర్ ప్రియా ప్రకాష్ వారియర్ మీ సినిమాలో నటించాలంటే  2 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వమని కండిషన్స్ పెడుతున్నాడట. మరి ఈ కండిషన్స్ చూసి హీరోలేమంటారో. అసలు ఇలా వచ్చిన మొదటి అవకాశానికే హీరోలను బెదరగొట్టేస్తే.. ఆ తర్వాత ఈ పిల్ల పరిస్థితి ఏమిటో అంటున్నారు. మరి టాలెంట్ కావాలనంటే 2  కోట్లు ఇచ్చి తెచ్చుకోవాల్సిందే అంటున్నారు కొందరు. మరి ప్రస్తుతం నిఖిల్ తోపాటు ప్రియా ప్రకాష్ మీద మెగా హీరోల కన్నుపడిందనే టాక్ కూడా ఉంది. మరి ప్రియా ప్రకాష్ రెండు కోట్లు మూడు కోట్లు అంటూ కూర్చుంటే.... ఆమె కెరీర్ మొదట్లోనే మంగళకరం  పాడేసినా పాడేస్తుంది... కాస్త చూసుకోమ్మా..!

Priya Prakash Varrier Remuneration for Telugu movie:

Priya Prakash Varrier Demands 2cr for Telugu Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs