Advertisement
Google Ads BL

చరణ్, సుకుమార్ మధ్య గొడవ నిజమేనా?


రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో వస్తున్న 'రంగస్థలం' గత ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమాని సుకుమార్ చెక్కి చెక్కి చెక్కుతూనే ఉన్నాడు. ఇప్పటికి ఈ సినిమాకి సంబందించిన పనులు పూర్తి కాలేదు. సినిమాని మార్చి 30 న విడుదల  చెయ్యడానికి  ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇప్పటికే రామ్ చరణ్ లుక్ తోపాటు రామ్ చరణ్ ఉన్న రంగస్థలం టీజర్ ని వదిలారు. అంతేకాకుండా సమంత ఉన్న సోలో టీజర్ ని సైతం విడుదల చేసింది చిత్ర బృందం. మరి రంగస్థలం నుండి వచ్చిన ఆ రెండు టీజర్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది చిత్ర బృందం. నిన్నగాక మొన్న ఎంత 'సక్కగున్నావే' అనే ఆడియో పాటని కూడా విడుదల చేశారు.

Advertisement
CJ Advs

మరి రామ్ చరణ్, సమంత ల ఫొటోస్ ని వీడియో రూపంలో ప్లే చేస్తూ విడుదల చేసిన ఆ ఆడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను రంగస్థలం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఆలపించాడు. అయితే రంగస్థలం సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ కి సుకుమార్ కి చిన్నవాదన జరిగినట్టుగా టాక్. అదేమిటంటే ఈ పాట ఆడియోతో పాటు... పాటకు సంబంధించిన సన్నివేశాలతో కూడిన రెండు నిమిషాల వీడియో కూడా విడుదల చేద్దామని రామ్ చరణ్ ప్లాన్ చేశాడట. ఇదే విషయమై డైరెక్టర్ సుకుమార్ కు చెప్పడమే కాదు... సుకుమార్ పై చరణ్ కాస్త ఒత్తడి కూడా చేశాడని సమాచారం. కానీ ఈ పాటలో సన్నివేశాలకు సంబంధించి డిజిటల్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో.... వీడియో సాంగ్ విడుదల చేయడం కుదరదని సుకుమార్ , చరణ్ కి చెప్పేశాడట.

అయితే చరణ్ కూడా పోనీ డిజిటల్ వర్క్ పూర్తయ్యాకే ఈ పాటను విడుదల చేద్దామని చెప్పినా వినకుండా సుకుమార్ ఎంత సక్కగున్నావే అనే పాటని విడుదల చేసేశాడట. మరి అలా చేసినందుకు చరణ్ కి కాస్త కోపం వచ్చినా.... ఆ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ బాగుండబట్టి సర్దుకుపోయాడంటున్నారు. మరి ఆ సాంగ్ కి గనక రెస్పాన్స్ అటు ఇటుగా ఉంటే సుకుమార్ కి, చరణ్ కి పెద్ద గొడవే అయ్యుండేదేమో.

Clashes between sukumar and ram charan:

Ram Charan wants Yentha Sakkagunnave Video Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs