భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ట్మాకంగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తన తండ్రి 'సై రా నరసింహారెడ్డి' చిత్రాన్ని నిర్మిసున్నాడు. నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడమే కాదు... భారీ క్రేజ్ తోపాటు భారీ అంచనాలు ఉన్నాయి. మరి భారీ తారాగణం నటిస్తున్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ మొదలెట్టుకోబోతోంది. మరి సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ తప్పుకున్నప్పటికీ వెంటనే రత్నవేలుని సెలెక్ట్ చేసిన చిత్రబృందం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మన్ తప్పుకున్నా... ఇంకా సై రా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ని సెట్ చెయ్యలేదు. ఈలోపు సై రా కు మ్యూజిక్ అందించేది వీళ్ళే అంటూ అనేక పేర్లు వినిపించినా అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. ఇంతవరకు సై రా మ్యూజిక్ డైరెక్టర్ ని సై రా బృందం ప్రకటించలేదు.
ఇకపోతే ఈ సినిమా నుండి అమితాబ్ బచ్చన్ తప్పుకున్నాడని.. అలాగే .. నయనతార నుంచి కాల్షీట్స్ సమస్య వచ్చిందని... ఇంకా సురేందర్ రెడ్డి డైరెక్షన్ మీద చిరు గుస్సా గా వున్నాడని అబ్బో అనేకానేకం రూమర్స్ బయటికి వచ్చాయి. మరి ఏ ఇబ్బంది తలెత్తినా రామ్ చరణ్ అలవోకగా అన్ని పరిష్కరించి ఏ ప్రాబ్లమ్ రాకుండా సెట్ చేసేస్తున్నాడట. మరి హీరోగా పరిణతి చెందిన రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగా తన టాలెంట్ ని చూపెడుతున్నాడు. ఇకపోతే అమితాబ్ సై రా కోసం డేట్స్ ఇచ్చేశారని... నయనతార డేట్స్ కూడా దొరికేశాయని అంటున్నారు. ఇక అన్ని రెడీ చేసుకుని సై రా సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చెయ్యడమే అంటున్నారు.
మరి మొదటి షెడ్యూల్ చిరు గెడ్డం పెంచి 'సై రా నరసింహారెడ్డి' లుక్ లో ఉంటే... ఇప్పుడు చిరు గెడ్డం తీసేసి మాసివ్ లుక్ లోకి మారిపోయాడు. చిరు గెడ్డం లేకుండా కూడా కొన్ని సీన్స్ ఈ 'సై రా నరసింహారెడ్డి' లో ఉన్నాయేమో అందుకే చిరు షేవ్ చేసుకుని బయట చాలా గ్లామర్ గా కనబడుతున్నాడు. చూద్దాం సై రా గురించిన ఏ న్యూస్ బయటికి వచ్చిన అది మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.