నటునిగా మోహన్‌బాబుని అందరూ మెచ్చుకుంటారు. ఇక ఈయన తాజాగా చేసిన 'గాయత్రి' చిత్రం సరైనటాక్‌ని తెచ్చుకోలేదు. దాంతో ఈ చిత్రం ఆడిందా? లేదా? హిట్టా? ఫట్టా అనే విషయాన్ని పక్కనపెడితే ఈ చిత్రంలో మోహన్‌బాబు.. చంద్రబాబునాయుడు, లోకేష్‌లపై పొలిటికల్ సెటైర్లు విసిరాడు. తద్వారా తాను తెలుగుదేశంలోకి వెళ్లడం లేదని, వైసీపీలోకే వెళ్లే అవకాశాలే ఉన్నాయని చూచాయగా తెలియజేశాడు. ఇక తాజాగా ఆయన ఓ ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయంగా సంచలన ప్రకటన చేయాలని భావిస్తున్నాడు.
ఈయనకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌లపై విమర్శలు చేసే స్థాయి, ధైర్యం లేకపోవచ్చు గానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని లోకేష్‌ని టార్గెట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇక బాలయ్య జోలికి కూడా ఈయన వచ్చే అవకాశం లేదు. ఈసారి మోహన్‌బాబు పుత్తూరు లేదా శ్రీకాళహస్తి నియోజక వర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక మోహన్‌బాబు తన ఆత్మకథను కూడా ఓ పుస్తకంగా రాస్తున్నాడు. ఇందులో కూడా ఆయన పలు సంచలన విషయాలను బయటపెట్టనున్నాడని తెలుస్తోంది.
ఇక 2019 ఎన్నికల్లో మోహన్‌బాబు వైసీపీలో చేరితే అది టిడిపికి ఏమాత్రం నష్టం చేకూరుస్తుంది? వైసీపీకి ఎంత లబ్దిని చేకూరుస్తుందనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అయినా పార్టీలను ప్రభావితం చేయగలిగిన సామర్ధ్యం ఆయనకి లేదని, మహా అయితే ఎమ్మెల్యేగా మాత్రం గెలవగలడని టిడిపి నాయకులు ఆయన్ను తేలిగ్గా తీసిపారేస్తున్నారు.