Advertisement
Google Ads BL

ప్రియ వారియర్‌ మరో బాంబ్ పేల్చింది..!


మలయాళంలో దుల్కర్‌సల్మాన్‌కి కూడా లేని విధంగా రాత్రికి రాత్రే 6లక్షల ఫాలోయర్స్‌ని సాధించి, జస్ట్‌ 26 సెకన్ల వీడియో నాటి 'కొలవరి' స్టైల్‌లో అందరినీ ఓ ఊపు ఊపుతోంది. ఈమె తాజాగా రెండు మిలియన్ల ఫాలోయర్స్‌ని సాధించి, తన సత్తా చాటుతోంది. ఇక ఈమె ఇంటర్వ్యూ కోసం ఆమె ఇంటి ముందు భారీ కోలాహలం ఏర్పడింది. ఈ ఇంటర్వ్యూల ఒత్తిడి తట్టుకోలేని ప్రియ ప్రకాష్‌ వారియర్‌ని ఆమె తల్లి బలవంతంగా హాస్టల్‌కి పంపివేసింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఇది చూసి కాకలు తీరిన సోషల్‌మీడియా కింగ్‌లు కళ్లు తేలేస్తూ ఆమె అదృష్టానికి అసూయ పడుతున్నారు. దాంతో ఈమెనే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిపి ఈ చిత్రం యూనిట్‌ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. 

Advertisement
CJ Advs

'ఒరు ఆధార్‌ లవ్‌'లోని ఐదు నిమిషాల పాటను విడుదల చేశారు. అందులో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా వారియర్‌ చూపిన సైగలే సెన్సేషన్‌గా నిలిచాయి. తాజాగా ఆమె క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రం టీజర్‌ని కట్‌ చేసి విడుదల చేశారు. తన చేతి వేళ్లని ముద్దు పెట్టుకుని, దానినే తుపాకిలో లోడ్‌ చేసిన విధంగా లోడ్‌ చేసి గురి చూసి ఆ హీరో రోషల్‌ అబ్దుల్‌ పైకి విసిరింది. ఇక ఈ కిస్‌ తుపాకీనీ పేల్చిన ఆమె గురి ఆ హీరో గుండెలనే కాదు.. యువత హృదయాలను కూడా తాకుతూ ఈ టీజర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. 

ఒమార్‌లల్లు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ఇక ప్రమోషన్స్‌తో పని లేదని, ఈమె కోసమే దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసినా కూడా కలెక్షన్లుకు డోకా ఉండదని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రాన్ని కేవలం మలయాళంలోనే రిలీజ్‌ చేస్తారా? లేక ఇతర భాషల్లోకి కూడా అనువదిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది...!

Click Here For Teaser

Priya Prakash Varrier One More Video Released:

<h1 class="title style-scope ytd-video-primary-info-renderer"><span style="font-weight: normal;">Oru Adaar Love Official Teaser Released</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs