Advertisement
Google Ads BL

సీతమ్మకి హీరోలతో ముద్దే ఎక్కువ ఇష్టమట...!


తెలుగమ్మాయి అయినప్పటికీ ముందుగా కోలీవుడ్‌లో తన నటనా ప్రతిభను చూపి తమిళుల గుండెల్లో మంచి స్థానం సాధించుకున్న హీరోయిన్‌ అంజలి. తమిళ హీరో, తన మొదటి చిత్ర కథానాయకుడు 'జై'తో ప్రేమలో ఉందని దోసె పోటీ ద్వారా వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత తన పిన్నితో పాటు ఓ తమిళ దర్శకుడిపై దాదాపు పోలీస్‌స్టేషన్ల మెట్టు కూడా ఎక్కింది. తమిళంలో గ్లామర్‌ పాత్రలు, తన వయసుకి తగ్గ పాత్రలు చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం సీనియర్‌ స్టార్స్‌ చిత్రాలలోనే అవకాశాలు సంపాదిస్తూ 'సీతమ్మ'గా గుర్తుండి పోయింది. అచ్చమైన చీరకట్టులో ఈమె అచ్చమైన తెలుగమ్మాయిలా ఉందని ప్రశంసలు అందుకుంది. అలాంటి భామ ఈ మద్య ఉన్నట్లుండి బొద్దుగా ఉన్న తాను స్లిమ్‌గా మారిపోయి, సోషల్‌ మీడియాలో తన ఫొటోలతో బీభత్సమైన ఫాలోయింగ్‌ని సాధించుకుంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలలో గాఢ ముద్దు సీన్లపై కూడా ఓపెన్‌గా మాట్లాడి వాటికి తాను సై అనే సంకేతాలను పంపింది. ముద్దు సీన్లలో కొన్నిసార్లు ఒక్కోసారి సోలోగానే నటించాల్సి వస్తుంది. సోలో క్లోజప్స్‌ కోసం అలా తీస్తుంటారు. ఆ సమయంలో ఎదురుగా కెమెరా తప్పితే ఎవరూ ఎదురుగా ఉండరు. నాకు అలా నటించడం కష్టంగా ఉంటుంది. సోలోగా ముద్దుపెట్టుకోవడం నాకు చాలా కష్టం. ఎదురుగా హీరోలు ఉంటేనే ఆ సీన్స్‌ పండుతాయి. ఎదురుగా ఉన్న హీరోతో ముద్దు సీన్లలో నటించడమంటేనే నాకు ఇష్టమని చెప్పుకొచ్చింది.

Heroine Anjali on kissing Scenes:

Kissing Scenes Without Hero Gets Boring.. says Anjali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs