నానితో 'జెంటిల్‌మేన్' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచమైన హీరోయిన్ నివేదాథామస్. ఆ తర్వాత ఈమె 'నిన్నుకోరి' చిత్రంలో భర్త, మాజీ ప్రేమికుడి మధ్య నలిగిపోయే పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్‌తో కలిసి ఆడిపాడిన 'జై లవకుశ' చిత్రం కూడా మంచి విజయాన్నే సాధించింది. ఇక తన కెరీర్ మొదట్లో వచ్చిన 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' చిత్రం భారీ డిజాస్టర్ అయింది. మొత్తానికి ఈ భామ మంచి సక్సెస్‌లు సాధించడంతో ఇక ఆమెకి వరుసగా చిత్రాలు వస్తాయని అందరు భావించారు. కానీ అందరు అనుకున్నట్లు ఆమె ఏమీ బిజీ కాలేదు. తాజాగా ఆమె మరో మూడు చిత్రాలలో నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో కూడా నిజం లేదని తేలిపోయింది.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా నితిన్, శర్వానంద్‌లు హీరోగా రూపొందనున్న 'దాగుడు మూతలు' అనే మల్టీ హీరోల చిత్రంలో ఈమెతో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈమె ఓ కొండ చిలువను తన మెడలో వేసుకుని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'బాబ్రా' (కొండ చిలువ)తో ఫోటోలు. చాలా చిన్న విషయం. కానీ నేననుకున్నంత చిన్న విషయమేమీ కాదని తెలిపింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వామ్మో ఎంత ధైర్యం. కొండచిలువను పట్టుకున్నావంటే మాటలు కాదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు లేక ఆమె ఇలా కాలక్షేపం చేస్తోందని కొందరు సెటైర్లు విసురుతున్నారు.