Advertisement
Google Ads BL

ఇందులో మాత్రం చంద్రబాబే నెంబర్ 1..!


దేశంలోని సీఎం లందరి కంటే స్థిర, చరాస్థుల రూపంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 177 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. చంద్రబాబు తర్వాత స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెన్‌ఖండు నిలిచాడు. ఈయన ఆస్థుల విలువ దాదాపు 129 కోట్లు. మూడో స్థానంలో పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ ఉండగా, నాలుగో స్థానంలో 15 కోట్లతో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు నిలిచారు. ఈ విషయాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ వెల్లడించింది. ఇక దేశంలోని అతి తక్కువ ఆస్తులు ఉన్న సీఎంలుగా త్రిపురకు చెందిన మాణిక్‌సర్కార్‌, పశ్చిమబెంగాళ్‌ సీఎం మమతాబెనర్జీ, మూడో స్థానంలో జమ్మూకాశ్మీర్‌కి చెందిన మొమబూబా ముఫ్తీ నిలిచారు. 

Advertisement
CJ Advs

మరి ఈ ఆస్తులు కేవలం నామ మాత్రమేనని మన సీఎంలకు కోట్లాది రూపాయల ఆస్థులు పలు విధాలుగా బినామీలుగా ఉంటాయని అంటారు. మరి నిజమైనా కాకపోయినా ఆస్థుల విలువలను ప్రకటిస్తుండటం ఎంతో కొంత మంచి పని కిందనే భావించాలి. ఎందుకంటే జగన్‌, గాలిజనార్ధన్‌రెడ్డి వంటివారు అసలు ఆస్తులను ప్రకటించే సంప్రదాయమే పాటించకపోవడం ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవాలి. మొత్తానికి విభజన తర్వాత కూడా ఏపీ విభజన కష్టాలతో నానా పురిటి నొప్పులూ పడుతున్నప్పటికీ సీఎం మాత్రం అత్యంత ఖరీదైన సీఎంగా నిరూపించుకోవడంపై బాగానే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Top Ten Richest Chief Ministers of India:

Chandrababu Naidu the Richest CM in India  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs