Advertisement
Google Ads BL

ప్రభాస్ ప్లానింగ్ ఏంటో అర్థమైందా?


ప్రభాస్ ఐదేళ్లు కష్టపడిన బాహుబలి గత ఏప్రిల్ లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. బాహుబలితో అల్ టైం రికార్డ్ నెలకొల్పిన ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. బాహుబలి తర్వాత హాలీవుడ్ స్టాండర్డ్స్ తో 'సాహో' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను తన అభిమానులను పలకరించే పరిస్థితి లేదు. షూటింగ్ మొదలైనప్పటి నుండి నత్తనడకన సాగుతున్న 'సాహో' షూటింగ్ మరియు గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ అవుతున్న కారణంగా 'సాహో' సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలవనుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. నిజంగానే 'సాహో' షూటింగ్ పెండింగ్ లో ఉండి పోవడం, గ్రాఫిక్ వర్క్ కూడా హెవీ కావడంతో తొందరపడి ప్రోడక్ట్ ని చెడగోట్టుకోవడం కంటే స్లోగా మంచి క్వాలిటీ ఇద్దామని దర్శకనిర్మాతలతో పాటే హీరో ప్రభాస్ కూడా డిసైడ్ అయినట్టు టాక్.

Advertisement
CJ Advs

మరి అలా 'సాహో' వహ్చే ఏడాది సంక్రాంతికి గాని లేకుంటే వేసవిలో గాని వచ్చే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 'సాహో'ని ఎలాగూ మరో ఏడాది వరకు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో... ఈలోపు ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను డిస్పాయింట్ చెయ్యడం ఇష్టంలేని ప్రభాస్ ఒక మీడియం బడ్జెట్  సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ కోసం గతంలో ఎప్పుడో ఒక మంచి కథని రెడీ చేసుకుని సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉండడమే కాదు... ప్రభాస్ కూడా రాధాకృష్ణ తో సినిమా చెయ్యడానికి సానుకూలంగానే ఉన్నాడు. అది ఇప్పుడు సెట్స్ మీదకెళ్లే సూచనలు ఉన్నాయంటున్నారు.  అలాగే ఈ సినిమాని ఎంత వీలయితే అంత త్వరగా పూర్తి చేసి దీపావళికి విడుదల చెయ్యడానికి వీలవుతుందా అనే ఆలోచన కూడా చేస్తున్నారట.

మరి అంతా అనుకున్నట్టుగా జరిగితే ప్రభాస్ పెదనాన్న నిర్మాణంలో ఈ సినిమా వచ్చే నెలలోనే  పట్టాలెక్కే సూచనలున్నాయంటున్నారు. పిరియాడిక్ లవ్ స్టొరీ గా రూపొందబోయే ఈ రాధాకృష్ణ సినిమా తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫారిన్ షూట్ అవసరం లేకుండానే పూర్తి చేసే అవకాశం ఉండటం వల్ల ప్రభాస్ ఈ సినిమా చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. మరి ఇదే గనక జరిగితే 'సాహో' సినిమా కి మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినట్లే. ఎందుకంటే రాధాకృష్ణ సినిమాని త్వరితగతిన పూర్తి చేసే హడావిడిలో 'సాహో' షూటింగ్ ని పక్కన పెట్టేస్తారేమో. చూద్దాం ఏం జరుగుతుందో.

What is The Prabhas Sketch?:

This is the Prabhas Planning for his next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs