Advertisement
Google Ads BL

'ఛల్ మోహన్ రంగా' అంటూ వచ్చేశాడు!


వరుస హిట్స్ తో జోష్ మీదున్న నితిన్, హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన 'లై' సినిమా మీద భారీగా అసలు పెట్టుకుని సూపర్ హిట్ కొట్టేద్దామనుకున్నాడు. నితిన్ - హను రాఘవపూడి కలయికలో మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'లై' సినిమా నితిన్ కి ఘోర పరాజయాన్ని మిగిల్చింది. ఇక 'లై' సినిమా తర్వాత నితిన్ మళ్ళీ తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో విజయాన్నిఅందించిన ప్రేమ కథలను ఎంచుకుంటాడేమో అని అనుకున్నారు అంతా.. కానీ నితిన్ మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో తన గురువు త్రివిక్రమ్, తన దేవుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద 'ఛల్ మోహన్ రంగా' అంటూ కొత్తగా ట్రై చేస్తున్నాడనిపిస్తుంది.

Advertisement
CJ Advs

లై సినిమాలో తనతో జోడి కట్టి తెలుగు తెరకు పరిచయమైన మేఘ ఆకాష్ తో కలిసి 'ఛల్ మోహన్ రంగా' అంటున్నాడు నితిన్. నిన్న విడుదలైన నితిన్ 'ఛల్ మోహన్ రంగా' ఫస్ లుక్ చూస్తుంటే మాములుగా వున్నా... లోగోలో చూస్తే మాత్రం ఇది రెగ్యులర్ ఫార్మేట్ లో కాకుండా భిన్నమైన  సినిమాలాగే కనిపిస్తోంది. టైటిల్ కింద 'ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్' అనే క్యాప్షన్ ఉన్నపుస్తకం, చక్రం లాంటి బొమ్మ, లవ్ సింబల్స్, బాటిల్, కుక్క ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఒక  సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉంటుందేమో అనే అనుమానం వస్తుంది.

తన తోలి సినిమా రౌడీ ఫెల్లోతో కొత్తగా ట్రై చేసిన లిరికిస్ట్ కృష్ణ చైతన్య, నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన కథతో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. మరి టైటిల్ తో 'ఛల్ మోహన్ రంగా'అంటూ వెరైటీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నితిన్ ఈ సినిమాతో ఏప్రిల్ 5 న ఎలాంటి హిట్ అందుకోబోతున్నాడో వెయిట్ అండ్ సి.

Nithiin Chal Mohanranga 1st Look out:

Nithiin's Chal Mohanranga First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs