Advertisement
Google Ads BL

సమంత పిచ్చ క్లారిటీ ఇచ్చింది..!


సినిమా ఫీల్డ్‌ గ్లామర్‌ ఫీల్డ్‌ అని తెలిసే వచ్చానని సమంత అంటోంది. ఆమె మాట్లాడుతూ, సినిమా కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌గా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే ఊరికినే గ్లామర్‌షో చేయాలంటే మాత్రం నాకిష్టం ఉండదు. ఇక నేను సినిమాలలో నటించడానికి నా భర్త నాగచైతన్య గానీ ఆయన కుటుంబ సభ్యులు కాదని అభ్యంతరం చెప్పలేదు. హీరోయిన్‌గా కొనసాగుతుండటం నాకు నచ్చింది. ఇక భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటే పెళ్లి తర్వాత కూడా వృత్తిలో సాగడం పెద్దగా కష్టం కాదు. నాకు నాగచైతన్యకి కూడా గొడవలు వస్తుంటాయి. కానీ నాగచైతన్య గొడవ తర్వాత దిగిరారు, నేనే కాస్త దిగి వచ్చి మాట్లాడుతాను. అయినా చైతూ గొడవలు పెట్టుకోడు. నేనే గొడవలు పెట్టుకుంటాను. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'అభిమన్యుడు' చేస్తున్నాను. విజయ్‌ సేతుపతితో 'సూపర్‌డీలక్స్‌' షూటింగ్‌లో ఉంది. తెలుగులో రెండు చిత్రాలతో పాటు బహుభాషా చిత్రం 'మహానటి'లో కూడా నటిస్తున్నాను... అని చెప్పుకొచ్చింది. అయినా చాలా మంది హీరోయిన్లు పెళ్లయితే కెరీర్‌ క్లోజ్‌ అవుతుందని భావిస్తారు. కానీ దానిని తప్పు అని సమంత నిరూపిస్తోంది. తొలి చిత్రంతోనే ఏదో మాయ చేసేసి, తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. 

ఇక ఈమె కన్నడ హిట్‌ మూవీ 'యూటర్న్‌'ని తానే నిర్మాతగా వ్యవహరిస్తూ నటిస్తోంది. మరోవైపు దానయ్య, కోనవెంకట్‌ల నిర్మాణంలో 'నిన్ను కోరి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లయిన తర్వాత తన భర్త నాగచైతన్యతో కలిసి నటించడానికి ఆమె ఓకే చెప్పింది. 

Samantha gives clarity on her cine stardom:

Naga Chaitanya and Samantha Akkineni to act together in a film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs