విలన్, హీరో, సపోర్టింగ్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ప్రతి తరహా పాత్రలకి జీవం పోసిన వారులో మోహన్‌బాబు ఒకరు. ఇక ఈయన తాజాగా ద్విపాత్రాభినయం పోషించిన పూర్తి స్థాయి చిత్రం 'గాయత్రి' విడుదలైంది. పెద్దగా టాక్ బాగాలేకపోయినా మోహన్‌బాబు నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. గాయత్రి పాత్ర ప్రేక్షకులను అలరిస్తుండగా, శివాజీ పాత్రలో మాత్రం డెప్త్ మిస్సయింది. ఇక ఇందులో మోహన్‌బాబు ఎవరిపై పొలిటికల్ సెటైర్లు విసురుతారా? అని అందరు ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో మోహన్‌బాబు 'బీకాంలో ఫిజిక్స్ చదివానని ఒకడంటాడు. మరోకడు నా పించన్లు తీసుకుంటున్నావు. నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నావు. నాకే ఓటేయమంటాడు. మరొకడు సార్వభౌమాధికారం అనేది పలకడం చేతకాక భౌభౌ అంటాడు. అంటూనే ఏపీలో జరుగుతున్న భూకబ్జా, ఇసుక మాఫియా, మంత్రులపై మోహన్‌బాబు సెటైర్లు పేల్చాడు. ఇవ్వన్నీ చంద్రబాబునే టార్గెట్ చేయడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక చంద్రబాబుకి నారా లోకేష్ ఎలా పప్పుగా పుట్టాడో మోహన్‌బాబుకి కూడా ఆయన కుమారులు పప్పులుగా పుట్టారనే విషయం మోహన్‌బాబు గమనిస్తే మంచింది. ఇక తాజాగా మోహన్‌బాబుని మీరు దర్శకుల పట్ల హార్డ్‌గా బిహేవ్ చేశారంట నిజమేనా? అని ప్రశ్నిస్తే, ఎవరినైనా పేరు చెప్పండి అని అడిగాడు. దానికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి దర్శకుడు సూర్యకిరణ్‌ని కొట్టారట అనగానే సూర్యకిరణ్‌ని ఇప్పుడు వచ్చి అది నిజమేనని చెప్పమనండి.. నా యావదాస్తీ మీకు రాసిస్తాను. మరి అతను అలా చెప్పకపోతే మీరేం ఇస్తారు? అని ప్రశ్నించాడు. దర్శకుడు అనే వాడు రథసారధి అని నేను నమ్ముతాను. ఇలాంటివి మాట్లాడే వారికి పని పాటా ఉండదు.
ఇలాంటివన్నీ మూర్ఖులు అనుకుంటూ ఉంటారు. బుర్ర పని చేయనివారు అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు. మరి మోహన్‌బాబు సాక్షి శివానంద్, ఆమె సోదరిపై దాడి చేసిన కేసు పోలీస్ స్టేషన్‌లో రిజిష్టర్ కావడం కూడా అబద్దమేనా? 'పెదరాయుడు' షూటింగ్‌లో జయంతి పట్ల ఆయన చూపిన ధోరణి కూడా అబద్దమేనా? అనేది ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగటం మర్చిపోయినట్లున్నాడు.