సోషల్‌మీడియా, సాంకేతిక విప్లవం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఇటీవల పవన్ ఫ్యాన్స్‌కి, కత్తిమహేష్‌కి మధ్య జరిగిన వైరం మీడియా ఇంత ఎక్కువగా లేకపోతే అంత పెద్దది అయ్యేది కాదనే చెప్పవచ్చు. ఇక తన సహజమైన అందంతో, హోమ్లీగా ప్రోగ్రామ్స్‌ని హోస్ట్ చేస్తే యాంకర్లలో సుమ తర్వాత శ్యామలను చెప్పవచ్చు. ఈమె అడపాదడపా సినిమాలలో కూడా కనిపిస్తోంది. తాజాగా ఈమె మాట్లాడుతూ, ఓబ్లూఫిల్మ్ వీడియోలో నటించిన వ్యక్తి స్థానంలో నా ఫొటోని మార్ఫింగ్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ వెబ్‌సైట్‌తో మాట్లాడి దానిని తీసివేయించాం.
ఇక ఈ వీడియోను నా భర్త చూసి నాకు పంపేంత వరకు నాకు తెలియదు. నా భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో నన్ను అర్ధం చేసుకున్నారు. అదే నా భర్త నన్ను అపార్ధం చేసుకుని ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తోంది. సోషల్‌మీడియా దూరంగా ఉన్న వారిని కలుపుతూ ఎంత మంచి చేస్తోందో.. చెడు చేయడంలో కూడా దీనిని మించిన దరిద్రం లేదని చెప్పుకొచ్చింది. నిజంగానే సోషల్‌మీడియా వల్ల నిండు జీవితాలను కూడా పొగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారనే చెప్పాలి.