Advertisement
Google Ads BL

లావణ్య ఇక సర్దుకోవడమేనా..?


'అందాల రాక్షసి, సోగ్గాడే చిన్ని నాయన, భలే భలే మగాడివోయ్' సినిమాల్తో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠికి కాలం కలిసి రావడంలేదు. నేను మోడరన్ అమ్మాయినే... కానీ నాకు సాంప్రదాయ పాత్రలొస్తున్నాయంటూ గగ్గోలు పెడుతూ గ్లామర్ గేట్లు తెరిచిన లావణ్యకి అంతా ఎదురే వస్తుంది. 'రాధా, మిష్టర్, యుద్ధం శరణం' నిన్నటికి నిన్న 'ఇంటిలిజెంట్' సినిమాలు ఆమెకు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. సంప్రదాయం  నుండి గ్లామర్ చూపించిన ప్రేక్షకుల తిరస్కరణే ఎదురవుతుంది.

Advertisement
CJ Advs

వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన 'ఇంటిలిజెంట్' లో లావణ్య పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఉంది లావణ్య వ్యవహారం. మరి వినాయక్ వంటి దర్శకుడు కూడా హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ లానే చూస్తే ఇక లావణ్య లాంటి హీరోయిన్స్ పరిస్థితి ఏమిటి. లెక్కకు మించి అందాల ప్రదర్శనకు దిగిన ఆమె పాత్రకి చిన్న పేరు కూడా రాలేదు. అనవసరంగా లావణ్య ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకుంటుంది అనే భావనని ప్రతి క్రిటిక్కె కాదు ప్రేక్షకుడు కూడా అంటున్నారు.

మరి ఇప్పటికే లావణ్య త్రిపాఠి మీద కోలీవుడ్ నిషేధం విధిస్తుంది అనే టాక్ ఉంది. మరి ఇక్కడ టాలీవుడ్ లోను లావణ్య పని అవుట్. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి ఇక అవకాశాలు లేక సరంజామా సర్దుకోవాలేమో అన్నట్టుగా వుంది వ్యవహారం. మరి ప్రస్తుతం సినిమాల్లేని లావణ్యని నెక్స్ట్ ఏంటి అంటున్నారు.

One More Flop in Lavanya Tripathi Account:

Lavanya get One More Flop with Inttelligent
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs