Advertisement
Google Ads BL

తమన్నా.. ఎలా స్పందించాలంటోంది!


ఓ నగల దుకాణం ఓపెనింగ్‌లో మిల్కీబ్యూటీ తమన్నాపై కరిముల్లా అనే వ్యక్తి బూటును విసిరేసిన సంగతి తెలిసిందే. దీని గురించి తాజాగా తమన్నా స్పందిస్తూ....కొంత మంది గిరి గీసుకుని ఉంటారు. ఆ గీత దాటి ప్రపంచం ఉందని భావించరు. వారి చర్యల వల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని కూడా భావించరు. కరీముల్లా అలాంటి వ్యక్తే. ఒక్కో సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. నా విషయంలో అతని స్పందన కూడా అలాంటిదే. ప్లాన్‌ ప్రకారం అతను అక్కడికి వచ్చి ఉన్నాడని నేను భావిస్తున్నాను. నేను ఎక్కువ సినిమాలలో నటించడం లేదని అతను అలా చేశాడని విన్నాను. దానికెలా స్పందించాలో నాకు తెలియడం లేదు... అని తన అభిప్రాయం తెలిపింది. 

Advertisement
CJ Advs

కాగా కరీముల్లా తెలుగులో తమన్నా ఎక్కువ చిత్రాలలో నటించడం లేదనే అలా చేశానని పోలీసుల విచారణలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక తమన్నా ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన ఓ చిత్రంతో పాటు బాలీవుడ్‌ 'క్వీన్‌'కి తెలుగు రీమేక్‌లో కంగనా రౌనత్‌ పోషించిన పాత్రను పోషిస్తోంది. 

Tamanna Response on Karimullah Incident:

Fan Throws Slipper At Baahubali Actress Tamannah 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs