Advertisement
Google Ads BL

‘సై రా’ని వినాయక్ అందుకే చేయనన్నాడా?


మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' తో మరోమారు తానేమిటో ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న 'సై రా నరసింహరెడ్డి' సినిమా షూటింగ్ కోసం కష్టపడుతున్నాడు. ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 'ఖైదీ నెంబర్ 150'కి మాస్ దర్శకుడు వినాయక్ దర్శకత్వం వహించాడు. అయితే సై రా కి ముందుగా సురేందర్ రెడ్డిని తీసుకుందామనుకోలేదట మెగా క్యాంప్. సై రా కి ముందుగా 'ఖైదీ నెంబర్ 150'  దర్శకుడు వినాయక్ అయితే బావుంటుందని మెగాస్టార్ చిరు కొడుకు సై రా నిర్మాత అయిన రామ్ చరణ్ అనుకున్నాడట. 

Advertisement
CJ Advs

అయితే చరణ్ చెప్పిన ప్రపోజల్ కి ఎగిరి గంతేసి ఒప్పేసుకున్న వినాయక్ తర్వాత డీప్ గా అలోచించి సై రా ప్రాజెక్ట్ తన వల్ల కాదని మెల్లగా జారుకున్నాడట. మరి మెగాస్టార్ తో 150 సినిమాని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన వినాయక్ ఇలా సై రా లాంటి బిగ్ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకున్నాడంటే... ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతుంది. మరి చరిత్ర మొత్తం తిరగేసి అవగాహన చేసుకుని ఇలాంటి ప్రాజెక్ట్ లు హ్యాండిల్ చెయ్యాలి. మరి అలా చారిత్రాత్మక చిత్రం చెయ్యాలి అంటే  దానికి సంబంధించిన పనులను అంటే సినిమా మొదలుపెట్టే నాటికీ ఆ సినిమా గురించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అవి అన్ని చాలా తతంగం ఉంటుంది. అయితే ఇలాంటి స్క్రిప్ట్ వర్క్ కి వినాయక్ ఎలా లేదన్న 6 నెలలు  తీసుకుంటాడు. మరలా ఆరు నెలలు పాటు చిరుని ఖాళీగా ఉంచడం ఎందుకులే అని వినాయక్ సై రా చేయలేనని చెప్పాడట.

అలా తప్పుకున్న వినాయక్ తన ఫ్రెండ్ అయిన సురేందర్ రెడ్డి ని ఈ సై రా ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ కి రికమెండ్ చేశాడనే టాక్ ఉంది. మరి వినాయక్ అలా 6 నెలలు చిరుని ఖాళీగా ఉంచడం ఎందుకనుకుని పక్కకి తప్పుకుంటే.. ఇప్పుడు మాత్రం ఏమైంది. చిరు సై రా ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మొదలవ్వడానికి ఏడెనిమిది నెలలు తీసుకుంటే... మొదలయ్యాక సెట్స్ మీద కెళ్లడానికి మూడు నెలలు తీసుకున్నారు. ఇకపోతే సై రా నరసింహారెడ్డి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు సమాయత్తమవుతోంది.

Why did vinayak Reject Sye Raa?:

Vinayak Rejected Sye Raa Narasimhareddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs