Advertisement
Google Ads BL

అనుష్కని అదే ప్రశ్న అడిగి విసిగించేస్తున్నారు!


బిల్లా, మిర్చి, బాహుబలి ఇలా అనేక సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క జంట రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను భార్య భర్తలవుతారని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ  బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుండి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ప్రేమ, పెళ్లి వార్తలను ప్రభాస్, అనుష్కలు కొట్టిపారేస్తున్నప్పటికీ ఆ వార్తలకు ఇప్పటి వరకు ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. అనుష్క ఏ ఇంటర్వ్యూలో కనబడినా మీడియా వాళ్ళు ఒకటే ప్రశ్న అనుష్కని అడగడం.. దానిని అనుష్క ఖండించడం అనేది పరిపాటిగా మారిపోయింది. 

Advertisement
CJ Advs

అలాగే ప్రభాస్ ని కూడా మీడియా వదలడం లేదు ఎన్నిసార్లు అనుష్క, నేను కేవలం ఫ్రెండ్స్ అని చేప్పినా మీడియాలో వచ్చే అనుష్క - ప్రభాస్ వార్తలకు అంతులేకుండా పోయింది. ప్రభాస్, అనుష్కని సోషల్ మీడియాలో పొగిడినా... అదిగో... ప్రభాస్, స్వీటీలు ప్రేమించుకుంటున్నారనే వార్తలు రేజ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క 'భాగమతి' హిట్ తో సంతోషంలో ఉంది. ఆ సంతోషంలోనే భాగమతి సక్సెస్ టూర్స్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తోంది. 

అయితే 'భాగమతి' ఇంటర్వ్యూలో భాగంగా అనుష్కకి మరోమారు ప్రభాస్ తో పెళ్లి విషయమై ప్రశ్న ఎదురుకాగా.. దానికి అనుష్క చిరాగ్గా... ఫేస్ పెట్టి కాస్త కోపంగానే... ప్రభాస్ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే... అంతకుమించి మా మధ్యన ఏం లేదు. బాహుబలిలో మా మధ్యన రొమాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అందరూ మా మధ్యన ప్రేమ ఉంది. త్వరలోనే పెళ్లి అనే వార్తలూ ఏ మాత్రం నిజం లేదు. అసలు ఈ విషయాన్ని ఇదివరకే మీకు చాలా సార్లు చెప్పాను... కానీ మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్నలతో ఎందుకు విసుగు తెపిస్తున్నారంటూ మీడియాకి ఘాటుగానే సమాధానం చెప్పింది. 

Anushka Angry on Marriage News:

Anushka again Clarity on Marriage with Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs