Advertisement
Google Ads BL

బెల్లం శ్రీదేవి తర్వాత వర్షయేనా..!


తెలుగులో ముద్దుగా బొద్దుగా ఉండే భామ రాశిఖన్నా తాజాగా 'తొలిప్రేమ' చిత్రం కోసం కాస్త బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. ఇందులో తాను వర్ష అనే పాత్రను చేస్తున్నానని, ఈ పాత్రలో మూడు కోణాలుంటాయని చెబుతోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ, తొలిప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోఎంతో మధురమైన అనుభూతి, కొందరికి అవి మంచి అనుభూతులను కలిగించి సక్సెస్‌ అయితే, మరికొందరికి చేదు అనుభవాలను మిగులుస్తాయి. మొత్తంగా ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఎదురైన తొలిప్రేమను మా 'తొలిప్రేమ' చిత్రం గుర్తుకు తెస్తుంది. మెచ్యూరిటీని బట్టి ప్రేమ ఎలా మారుతుంది? అనే విషయాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి అద్భుతంగా చెప్పారు. ఆయన రెండేళ్ల పాటు ఈ కథను ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక నా 15వఏట ఓ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట తిరిగాడు. అప్పటిదాకా నాకు తొలిప్రేమ అంటే ఏమిటో తెలియదు. ఆ అబ్బాయికి యస్‌ అని గానీ నో అని గానీ చెప్పలేదు. చివరకి అతనికే విసుగొచ్చి కామ్‌ అయిపోయాడు. ఇక ఈ చిత్రంలోని పాత్రల కోసం నేను వరుణ్‌తేజ్‌ ఐదు కిలోలు పెరుగుతూ, ఐదు కిలోలు తగ్గుతూ వచ్చాం. నన్ను చాలా మంది 'ఊహలు గుసగుసలాడే' తర్వాత అంత అందమైన ప్రేమకథ ఎప్పుడు చేస్తారు అని అడుగుతు వస్తున్నారు. వారికి తొలిప్రేమ మంచి సమాధానం ఇస్తుంది. ఈ చిత్రంలోని ఓ పాటను శ్రేయోఘోషల్‌ అద్భుతంగా పాడింది. నేను అంత గొప్పగా పాడలేను కాబట్టి ప్రయోగం చేయదలుచుకోలేదు. 

ఇక నా పాత్రలకు నాకే డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. తదుపరి చిత్రాలలో సొంత డబ్బింగ్‌ చెప్పుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ భామ 'జోరు' చిత్రంలో కూడా పాటను అద్భుతంగా పాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన 'ఆక్సిజన్‌, టచ్‌ చేసి చూడు' చిత్రాలు చేదు ఫలితాలను అందించాయి. అంతకు ముందు ఆమె మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో నటించిన 'సుప్రీమ్‌' చిత్రంలో బెల్లం శ్రీదేవిగా మెప్పించింది. ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో నటిస్తున్న 'తొలిప్రేమ' చిత్రం 10వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ఆమెకి ఎంతో కీలకం కానుంది. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Raashi Khanna Praises Varun Tej:

She Praises Varun Tej Immensely  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs