Advertisement
Google Ads BL

అనసూయకి రేష్మి వంత పాడుతోంది!


హాట్‌యాంకర్‌, సినీ నటి అనసూయ తాజాగా ఓ పిల్లాడిపై తన పెత్తనం చెలాయించి పెద్ద ఘనకార్యమే చేసింది. తనతో సెల్ఫీ దిగబోయిన పిల్లాడి ఫోన్‌ని తీసుకుని కోపంతో నేలకేసి కొట్టింది. దీనిపై ఆమెపై ఆ పిల్లాడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో నెటిజన్ల నుంచి అనసూయ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఆమె తీరుని నిశితంగా విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మొదట తనను తాను సమర్ధించుకోబోయిన అనసూయ నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండటంతో సోషల్‌మీడియాలోని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి వెళ్లిపోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె తస సహనటి, మంచి స్నేహితురాలు, మరో జబర్ధస్త్‌ భామ అయిన రేష్మిని ఉద్దేశించి నెటిజన్లు... నీ ఫ్రెండ్‌కి పబ్లిక్‌లో ఎలా బిహేవ్‌ చేయాలో కనీసం నీవైనా చెప్పు అని పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన రేష్మి సారీ డ్యూడ్‌... నేను ఆమె గార్డియన్‌ని కాదు. అయినా నాకంటే అనసూయ ఎంతో సాఫ్ట్‌. నేను సెల్ఫీలకి కోపం ప్రదర్శిస్తాను. కానీ అనసూయ అలా కాదు. ఆమె సెల్ఫీలకి ఎంతో సహకరిస్తుంది. మరి ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో తెలియదు. బహుశా ఆమె అలా చేసి ఉండకపోవచ్చు అంటూ వంత పాడి తాను కూడా అదే కోవకి చెందిన దానినని నిరూపించుకుంది. 

ఇక తాను కారులో వెళ్లేటప్పుడు కొందరు తనని ఫాలో అవుతూ, ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ ఉంటారని, వారిని చూస్తే ఎక్కడ వారికి యాక్సిడెంట్‌ అవుతుందోనని తాను కంగారు పడుతూ ఉంటానని, కానీ తాను వారిని క్షమించి కనీసం పోలీస్‌ కంప్లైంట్‌ కూడా ఇవ్వకుండా వదిలేస్తూ ఉంటానని చెప్పుతూ తనెంత ఉదార స్వభావురాలో చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Anchor Rashmi Shocking Answer on Anasuya Issue:

Rashmi Gautam Reacts Netizens Tweets About Anasuya Incident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs