Advertisement
Google Ads BL

రాధికా ఆప్టే భలేగా చెప్పిందిగా..!!


హీరోయిన్స్ ఎక్కువ పారితోషికాలు తీసుకుని బాగా వెనకేసుకుంటారు. అలాగే సినిమాల మీద వచ్చిన డబ్బుతో ఇతర వ్యాపారాలు చేస్తూ లాభాలు గడిస్తుంటారు అనే నానుడి పాత కాలం నుండి ఉంది. అయితే హీరోయిన్స్ కి సంపాదనకు తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ఎందుకంటే వారు మేకప్ లేకుండా.. కొత్తగా వెరైటీగా దుస్తులు లేకుండా జనాల్లోకి రాలేరు. హీరోయిన్స్ అంటే ఎప్పుడూ కొత్తగా కొంగొత్తగా ఉండే ఒక అందమైన అమ్మాయి అనేలా.. వారు బయట ప్రపంచానికి ఫ్యాషన్ ని పరిచయం చేస్తారు. అలాగే ఎప్పుడూ నాజూగ్గా ఉండేందుకు బోలెడు డబ్బుని కూడా తగలేస్తారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక హీరోయిన్ బహిరంగంగానే చెబుతుంది. హీరోయిన్స్ కి సంపాదన బట్టే ఖర్చులు ఉంటాయని కుండబద్దలు కొడుతోంది. ఆమె ఎవరో కాదు 'లెజెండ్' లో బాలయ్య సరసన నటించిన రాధికా ఆప్టే. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక బాలీవుడ్ లో సెటిల్ అవుదామని తెగ ట్రై చేస్తూ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిన రాధికా ఆప్టే.. హీరోయిన్స్ కి ఉండే ఖర్చులు ఎలాంటివో ఏకరువు పెడుతుంది. అమ్మడు నటించిన  'ప్యాడ్ మ్యాన్' ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వూస్ లో రాధికా హీరోయిన్స్ పడే కష్ట సుఖాల గురించి వివరిస్తుంది.

అసలు హీరోయిన్స్ తమ అందాన్ని కాపాడుకోవడం కోసం బ్యూటీషియన్స్, అలాగే కొత్త రకాల దుస్తులు కోసం డిజైనర్ ని, చక్కటి శరీరాకృతి కోసం ట్రైనర్‌ని ఏర్పాటు చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చవుతుందని రాధికా ఆప్టే చెబుతుంది. హీరోయిన్ అనేది ఒక ఖరీదైన ఉద్యోగమని రాధికా ఆప్టే తేల్చి పారేసింది.ఇక 'ప్యాడ్ మ్యాన్' గురించి రాధికా మాట్లాడుతూ అలాంటి ప్రాజెక్ట్ లో తాను భాగమైనందుకు గర్వంగా ఉందని చెబుతుంది.

Radhika Apte about Problems of Heroines:

we have so many problems says Radhika Apte
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs