Advertisement
Google Ads BL

భర్త ఏడిపిస్తున్నాడంటున్న స్టార్ హీరోయిన్!


సామాన్యులు ఎంత పెద్ద విషయం చెప్పినా కూడా వార్త అవుతుందో లేదో చెప్పలేం గానీ సెలబ్రిటీలు అందునా సినిమా వారు ఏమి మాట్లాడినా దానికి ఎక్కడలేని ప్రాధాన్యత వస్తుంది. ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌లో ఉన్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ సినీ కపుల్స్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌- కరీనా పూర్‌ల జంట కూడా ఒకరు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా తైమూర్‌ కూడా జన్మించాడు. ఇక తమ బాబుకి తైమూర్‌ అని పేరు పెట్టడంతో పలువురు ఆ జంటపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా కరీనా కపూర్‌ ఓ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ, సైఫ్‌ అలీ ఖాన్‌పై తనకున్న ప్రేమని వెల్లడించింది. పెళ్లయి ఇన్నేళ్లయినా తన భర్త తనని ఇంకా బాధపెడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఇంతకీ విషయం ఏమిటంటే... ఇప్పటికీ సైఫ్‌ ఆలీ ఖాన్‌ షూటింగ్‌ల నిమిత్తం బయటకు వెళ్తుంటే కరీనా కపూర్‌కి తన భర్త దూరంగా వెళ్తుండటం వల్ల ఎంతో బాధగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఆమధ్య సైఫ్‌ కూడా మీడియా ఎదుటే తనకు కరీనా అంటే ఉండే ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేశాడు. కరీనా బాధ్యత కలిగిన తల్లిగా ఉండటం నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది. తను ఎప్పుడు ప్రేమగానే ఉంటుంది. తైమూర్‌ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అందుకే తైమూరికి కూడా తన తల్లి కరీనా అంటేనే ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు. 

ఇక కరీనా కపూర్‌ ప్రస్తుతం 'వీరే ది వెడ్డింగ్‌' షూటింగ్‌లో బిజీగా ఉంది. శశాంక్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సైఫ్‌ అలీ ఖాన్‌ 'కళాకండి' చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. 

Kareena Kapoor Reveals About Her Husband Saif Ali Khan:

Kareena Kapoor Khan: Taimur’s father wants him to be as much away from the limelight as possible
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs