Advertisement
Google Ads BL

వర్మని తన్నడానికి ఫ్యాన్స్‌ రెడీనా..?


నాగార్జున ఎందరో అప్‌కమింగ్‌, కొత్త దర్శకులకు చాన్స్‌లిచ్చాడు. వారిలో రాంగోపాల్‌వర్మ ఒకడు. ఇక తెలుగు సినీ చరిత్ర విషయానికి వస్తే 'శివ' ముందు తర్వాత అని విభజించాలి. ఇది నేటికి కూడా నిజమే. కానీ ఆ తర్వాత వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'అంతం, గోవిందా గోవిందా' చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇంతకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా టేబుల్‌పై టీ గ్లాస్‌, పోలీస్‌ టోపీ, గన్‌ పెట్టిన స్టిల్స్‌తో పాటు నాగ్‌ స్టిల్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ఓ పాప భయభ్రాంతులతో ఉంటే నాగార్జున రివాల్వర్‌తో కాస్తున్న స్టిల్‌ విడుదల చేశారు. ఈ స్టిల్‌ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మేం త్వరలో వచ్చేస్తున్నాం అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. దానికి వర్మ స్పందిస్తూ, నాగార్జున తన్నిన తన్నుతో నాకు 'శివ' వచ్చింది. మరోసారి నాగార్జున తన్నాల్సివుంది. త్వరలో టైటిల్‌ని, రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తాం అని చెప్పాడు. దానికి నాగార్జున 'కిక్‌కి రెడీ' అని రిప్లై ఇచ్చాడు. దాంతో వర్మ 'నేను భారీ హిట్‌ ఇవ్వకపోతే నన్ను తన్నడానికి మీ అభిమానులు ఎలాగూ సిద్దంగా ఉన్నారు. నీ తన్నులన్ని సినిమాలో విలన్స్‌ని తన్నడానికి అట్టిపెట్టుకో.. నీ ఫ్యాన్స్‌ మాత్రం నాకోసం అట్టిపెడతారు' అంటూ స్పందించాడు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రను మైరాసరీన్‌ పోషిస్తుండగా, ఈ చిత్రం కోసం 'గన్‌, సిస్టమ్‌' అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. 

Akkineni Fans to Assault Him:

RGV-Nag talk about Akkineni fans assault
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs