Advertisement
Google Ads BL

శ్రియకేనా పెళ్లి...?


శ్రియాశరణ్‌.. బహుశా ఈమె సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి నేడు యుక్త వయసులో ఉన్న వారు కూడా పుట్టి ఉండరు. ఈమె వయసు దాదాపు 37ఏళ్ల పైనే. ఇక ఈమె తెలుగులోకి రామోజీరావు నిర్మాతగా వచ్చిన 'ఇష్టం' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇండస్ట్రీకి వచ్చి 17ఏళ్లు కావస్తోంది. ఇక హీరోయిన్లని సాధారణంగా మీ పెళ్లెప్పుడు అని అడిగితే.. ఇప్పుడేనా? ఇంకా సినిమాలలో బిజీగానే ఉన్నాం. ఇంకా పెళ్లికి సమయం ఉంది. పెళ్లి చేసుకునేటప్పుడు మీకు చెప్పే చేసుకుంటాం అని చెబుతారు. కొందరైతే హీరోలని ఆ మాట అడగకుండా హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు? అని మండిపడతారు. శ్రియాని మాత్రం ఎవరైనా పెళ్లి విషయమై ప్రశ్న అడిగితే 'మైండ్‌ యువర్‌ బిజినెస్‌' అని కోపంతో ఊగిపోతుంది. 

Advertisement
CJ Advs

కాగా ఈ మధ్య ఈమె తన వయసుకు తగ్గ పాత్రలు, తనకి సూటయ్యే హీరోల సరసన నటిస్తోంది. తాజాగా ఆమె మంచు విష్ణు వంటి యంగ్‌హీరో సరసన 'గాయత్రి' చిత్రంలో శారద పాత్రను చేస్తోంది. ఇది తప్ప ఈమె చేతిలో పెద్దగా ఆఫర్స్‌ కూడా లేవు. దాంతో ఈమె త్వరలో పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈమెకి ఓ రష్యాకి చెందిన వ్యాపారవేత్తతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని అంటున్నారు. ఇప్పటికే శ్రియ కుటుంబ సభ్యులు కూడా ఆ యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారని, ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితో వీరి వివాహం రాజస్థాన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా మార్చిలో జరగనుందని తెలుస్తోంది. ఈమె కూడా పెళ్లి చేసుకుంటే సీనియర్‌ స్టార్స్‌తో నటించేందుకు హీరోయిన్ల కొరత ఏర్పడుతుందనే చెప్పాలి. ఈమె కూడా సమంత సరసన చేరడానికి రెడీ అవుతోందని కన్‌ఫర్మ్‌గా చెబుతున్నారు. అయితే శ్రియ పెళ్లి నాకు కాదు.. నా ఫ్రెండ్ కి అని ఈ పెళ్లి వార్తలపై స్పందించినట్లుగా తెలుస్తుంది. 

Wedding Bells Ringing for Shriya:

Shriya to marry her Russian boyfriend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs