Advertisement
Google Ads BL

సోషల్‌మీడియాకి హాట్ యాంకర్ షాక్!


ఇటు బుల్లితెరపై హాట్‌ యాంకర్‌గా, వెండితెరపై కూడా తన అందాలు, డ్రస్సింగ్‌లతో అందరినీ ఆకట్టుకుంటున్న నటి అనసూయ. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ -సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రంలో గ్రామీణ వ్యక్తిగా, రంగమ్మత్తగా నటిస్తోంది. ఇక తాజాగా ఈమె సోషల్‌మీడియా నుంచి బయటికి వెళ్లిపోయింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకి గుడ్‌బై చెప్పింది. ఆమె ఓ పిల్లాడు సెల్ఫీ అడిగితే ఫోన్‌ని నేలకి విసిరికొట్టింది. ఈ ఫోన్‌ స్క్రీన్‌కూడా పగిలిపోయింది. ఓ చిన్న పిల్లాడి పట్ల ఆమె ఇలా వ్యవహరించడం పట్ల ఆమెపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువరు నెటిజన్లు ఆమెపై మండిపడుతూ, పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో నెటిజన్ల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే అనసూయ సోషల్‌మీడియాలోని అన్ని మాధ్యమాలకు గుడ్‌బై చెప్పింది. 

Advertisement
CJ Advs

ఈమె వ్యవహారం చూస్తుంటే అడుసు తొక్కనేలా... కాలు కడగనేలా అనే సామెత గుర్తుకు వస్తోంది. అయితే ఈ విషయంలో తన తప్పేమి లేదని, ఇదేమీ దేశం మొత్తం చర్చించాల్సిన విషయం కాదని, తన ప్రైవసీకి అడ్డు వస్తే ఇలాగే చేస్తానంటూ ఆమె నెటిజన్లపై మండిపడటంతో ఈ నిరసన సెగ మరింతగా అనసూయని తాకింది. మొత్తానికి ఆమె నిర్ణయం పట్ల కొందరు మంచి పని చేసింది.. అంటుంటే కొందరు మాత్రం ఆమె చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సిందేనని, సోషల్‌మీడియా నుంచి తప్పుకున్నంత మాత్రాన అది పరిష్కారం కాదని, ఆమె లేడీ బాలయ్యగా మారిందని సెటైర్లు వేస్తున్నారు.

Anchor Anasuya quits social media:

<div>Anasuya Bharadwaj deletes all her social media accounts</div> <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs