స్టార్ హీరోల సినిమాల్లో మామూలు డ్యూయెట్, రొమాంటిక్ సాంగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. అందులో వచ్చే ఐటెం పాటకి అంతే కిక్ ఉంటుంది. అందులోను దర్శకుడు సుకుమార్ సినిమాల్లో ఐటెం పాట అంటేనే కుర్రకారుకు ఊపొచ్చేస్తుంది. సుకుమార్ తనకు తెరకెక్కించే సినిమాల్లో అంత అద్భుతంగా ఐటెం సాంగ్ ని పెడతాడు. ఇక ఈ ఐటెంకి దేవిశ్రీ కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇస్తాడు. అసలు దేవిశ్రీ మ్యూజిక్ లో ఐటెం సాంగ్స్ కి ఇచ్చే మ్యూజిక్కే వేరప్పా అన్నట్టుగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇదే కాంబోలో ఒక అదిరిపోయే ఐటెం తెరకెక్కుతుంది.
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న రంగస్థలంలోని ఐటెం పాట ఆల్రెడీ మొదలైపోయింది. తాజాగా రంగస్థలంలోని ఐటెం పాటకి పూజ హెగ్డే ఆడిపాడి రచ్చ రచ్చ చేస్తుందట. మరి డీజే తో టాప్ హీరోయిన్ అయిన పూజాతో ఈ ఐటెంని తెరకెక్కిస్తున్నారంటే... ఆ పాట ఎలా ఉంటుందో అనేది సినిమా విడుదలయ్యే వరకు కూడా మెగా ఫ్యాన్స్ ఆగేలా లేరు. మరి ఫ్యాన్స్ కి నచ్చేలా సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ఇద్దరు సెట్ చేసుకున్న పాట చాలా కొత్తగా ఉండబోతోందట. ఇకపోతే ఈ ఐటెం సాంగ్ జిగేల్ రాణి అనే నేమ్ తో సాగుతుందనే టాక్ వినబడుతుంది.
జిల్ జిల్ రాణి.. జిగేల్ రాణి కోసం దేవిశ్రీ ట్యూన్ ఎలా ఉంటుందో గాని జిగేల్ రాణి అనే పేరే చాలా కొత్తగా ఉంది. మరి వినడానికే కొత్తగా మాస్ గా ఉన్న ఈ ఐటెం పాట రంగస్థలం ఆల్బమ్ మొత్తానికి హిట్ అయినా అవ్వొచ్చు అని అంటున్నారు. మరి పూజా లాంటి జిగేల్ రాణితో రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్స్ ని చూడడానికి మెగా ఫ్యాన్స్ మార్చి 30 కల్లా రెడీ అయిపోండి. ఇకపోతే రంగస్థలంలో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటిస్తుంది.