చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి. కొడుకు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మొదలు అయ్యిన దగ్గర నుండి చిరంజీవి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయుర్వేద చికిత్స తీసుకునేటందుకు వైజాగ్ కి వెళ్లనున్నారు చిరు.
ఫస్ట్ షెడ్యూల్ మొత్తం చిరుపై యాక్షన్ పార్ట్ తీశారు. మరి ఉయ్యాలవాడ జీవితంలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ యాంగిల్ చిత్రీకరణ కోసమే చిరంజీవి తెగ కష్టపడుతున్నాడు. యంగ్ లుక్ తో కనిపించేందుకు ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నాడట. చర్మంలో మెరుపును పెంచి వయసును కాస్త తగ్గించే విధంగా చికిత్స అందిస్తారట. కొన్ని రోజులు పాటు వైజాగ్ లో ఉండి ట్రీట్మెంట్ అయ్యాక షూటింగ్ లో పాల్గొంటాడట.
అలానే ఈ సినిమా కోసం డైలాగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు చిరు. రైటర్ సాయి మాధవ్ బుర్రాను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ డైలాగులు రాయించాడని సమాచారం. అలానే పరుచూరి బ్రదర్స్ చేత కూడా చిన్న చిన్న మార్పులు చేయించారని తెలుస్తోంది.