Advertisement
Google Ads BL

పెళ్లిపై మరోసారి స్వీటీ షాక్..!


ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ప్రభాస్‌, రానా, నితిన్‌, అనుష్కల పేర్లు మార్మోగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌-అనుష్కలకు మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి. వీటిని వారిద్దరు ఖండించినా కూడా ఆ వార్తలు ఆగడటం లేదు. వారు మేము కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అనే చెబుతున్నా కూడా అందరూ వారిది ప్రేమ అంటున్నారు. ఇక వీరి అభిమానులు కూడా ఈ హిట్‌ పెయిర్‌ ఒకటి అయితే కావాల్సింది ఏముంది అంటున్నారు. ఇక అనుష్కకి గతంలో నాగార్జున, గోపీచంద్‌ విషయాలలో కూడా ఎఫైర్లు అంటగట్టారు. ఇక అనుష్క నా పెళ్లిపై నాకు క్లారిటీ ఉంది.. మీరు కాస్త మా విషయం ఆలోచించకండి అని ఘాటుగా చెబుతున్నా కూడా ఎవ్వరూ వినకుండా తమకు తోచింది వండి వార్చేస్తున్నారు. తాజాగా అనుష్క తన వివాహంపై మరోసారి స్పందించింది. 

Advertisement
CJ Advs

నచ్చినవాడిని వివాహం చేసుకోవాలని నాకు కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలంటే నాకెంతో ఇష్టం. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని నాకు కూడా ఉంది. పెళ్లనేది జీవితంలో ఎంతో ముఖ్య విషయం, సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇక అనుష్క లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆమె నటించిన 'అరుంధతి' చిత్ర విజయంలో కథ, కథనాలదే పైచేయి. 'రుద్రమదేవి'లో క్రెడిట్‌ అల్లుఅర్జున్‌ ఖాతాలోకి వెళ్లింది. ఇక 'వర్ణ, సైజ్‌జీర్‌'లు ఫ్లాప్‌ అయ్యాయి. 

ఇక 'బాహుబలి'లో ఆమెకి దక్కే క్రెడిట్‌ పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెద్దగా కథ, కథనాల బలం లేకుండా వచ్చిన 'భాగమతి' చిత్రం వసూళ్లు చూస్తుంటే ఇంతకాలానికి అనుష్క మార్కెట్‌ రేంజ్‌ ఏమిటో అందరికీ అర్ధమైంది. కానీ తాజాగా ఆమె మరో చిత్రం ఒప్పుకోలేదు. కోలీవుడ్‌ దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో మాత్రం ఓ చిత్రం చేయనుంది. మరి అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచిచూడాల్సివుంది.

Anushka About Marriage Rumours:

I want to get married at the right time: Anushka Shetty  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs