Advertisement
Google Ads BL

ఈ కుర్ర హీరోకి కూడా ఫ్యాన్స్‌ బాగున్నారు!


ప్రస్తుతం ఉన్న కొత్తతరం యంగ్‌ హీరోలలో నాగశౌర్య తనదైన రూపురేఖలు, నటనతో బాగా ఆకట్టుకుంటూ అమ్మాయిల నుంచి అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఈయన తాజాగా తానే నిర్మించి, నటించిన 'ఛలో' చిత్రం.. రవితేజ నటించిన 'టచ్‌ చేసి చూడు' కంటే బాగుందనే మౌత్‌టాక్‌తో పాటు మంచి రివ్యూలు కూడా అందుకుంది. సందీప్‌కిషన్‌, ఆది సాయికుమార్‌ వంటి హీరోల కంటే అతితొందరగా నాగశౌర్యకే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సినిమా సినిమాకి పెరుగుతోంది. నేటి తరం యంగ్‌ హీరోలలో ఈయన్నే డ్రీమ్‌ బోయ్‌ అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక నాటి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు వంటి వారిని చూసి నాటి అమ్మాయిలు అలాంటి మొగుడే కావాలని పట్టుబట్టేవారు. కొందరు తమ అభిమానానికి గుర్తుగా తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకుని మురిసిపోయేవారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి వారికి నేడున్న వారిలో పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌లకి కూడా అంతటి ఇమేజ్‌ ఉంది. వీరి పేర్లను కూడా తమ పిల్లలకి ముద్దుగా పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. 

అయితే ఏకంగా ఓ అభిమాని తన కుమారుడికి హీరో నాగశౌర్య పేరు పెట్టుకోవడం అంటే కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. నాగశౌర్యకి పెరుగుతున్న ఈ క్రేజ్‌కి ఇది నిదర్శనంగా, వారి కుటుంబానికి సంతోషంగా చెప్పుకోదగిన విషయమే ఇది. . తాజాగా ఈ చిత్రానికి పనిచేసిన లిరిక్‌రైటర్‌ కాసర్ల శ్యామ్‌ ఈ విషయాన్ని తెలిపాడు. ఆయన మాట్లాడుతూ., నాకు ఫేస్‌బుక్‌లో అమెరికాకి చెందిన వందన అనే ఫ్రెండ్‌ ఉంది. ఆమె కజిన్‌ నాగశౌర్యకి పెద్ద అభిమాని, ఆ కజిన్‌కి 'ఛలో' విడుదలైన రోజునే ఓ బాబు పుట్టాడు. దాంతో ఆ జంట తమ పిల్లాడికి 'శౌర్య' అనే పేరును పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మీ హీరోకి చెప్పండి అని వారు అడగటంతో ఈ విషయం చెబుతున్నాను అంటూ స్వీట్‌ షాక్‌నే ఇచ్చాడు.

Kasarla Shyam About Naga Shourya Fan:

Naga Sourya Name to USA Vandana Son
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs