Advertisement
Google Ads BL

తేజూని ఈ స్టార్‌ బాగానే మోశాడు...!


తాజాగా జరిగిన 'ఇంటెలిజెంట్‌' ప్రీరిలీజ్‌ వేడుకతో రాజమండ్రిలో మంచి సందడే జరిగింది. స్టేజీ ఎక్కిన ప్రతి ఒక్కరు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ని మోశారే గానీ కాస్త మావయ్యల చట్రం నుంచి బయటకు రమ్మనే సలహా కూడా ఎవ్వరు ఇవ్వకపోవడం చూస్తుంటే సినిమా ఫీల్డ్‌లో పైకెత్తేవారు.. దభాలున పడిపోతే మరింత తొక్కేవారు తప్పితే సరైన సలహాలు చెప్పేవారు ఉండరనే మాట నిజమే అనిపిస్తుంది. ఇక ఈ 'ఇంటెలిజెంట్‌'ని చూస్తే అదే జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి వంటి వారితో కామెడీ ట్రాక్‌ లాగించేశారనే చెప్పాలి. ఇక బ్రహ్మితో పాటు 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ, సప్తగిరి కూడా ఉండటంతో ఇక నేల టిక్కెట్‌ కామెడీకి వినాయక్‌, తేజులు రెడీ అయ్యారనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

ఇక ఈ వేడుకలో పృథ్వీ అయితే ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఇందులో సాయిధరమ్‌తేజ్‌తో తనకి కాంబినేషన్‌ సీన్స్‌ లేవని, కానీ ధర్మాభాయ్‌ అంటే వణికిపోయే పాత్ర తనదని చెప్పాడు. మెగాహీరోలందరితో నటించాను ఆ ఒక్క హీరోతో ఇంకా చేయలేదంటూ ఆయన్ను కూడా కాకాపట్టాడు. ఈ సినిమాలో దర్శకుడు తమ చేత డ్యాన్స్‌లు, ఫైట్స్‌ చేయించలేదు గానీ రోడ్లు వేయించాడని చెప్పాడు. అంటే ఈ చిత్రంలో కమెడియన్స్‌ రోడ్లు వేసి, చెత్త ఊడ్చి స్వచ్చభారత్‌ ప్రోగ్రాం పెట్టారో లేదో సినిమా చూస్తే గానీ తెలియదు. 

ఇక సాయిధరమ్‌తేజ్‌కి పవన్‌ కళ్యాణ్‌ ఆశీస్సులు ఉన్నాయంటూ భజన చేశాడు. అంటే పవన్‌ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి చిరు మాట మర్చిపోతే ఎలా అంటున్నారు కొందరు. ఈ చిత్రం సాయిధరమ్‌తేజ్‌కి మంచి పేరు తేవాలని, మంచి హిట్‌గా ఈ చిత్రం నిలబడాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్ధిస్తున్నానంటూ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అది విషయం. మరి రిజల్డ్‌ ఏమిటో చూడాలంటే 9వ తేదీ వరకు వెయిట్‌ చేస్తే సరి. 

30 years Prudhvi Praises Sai Dharam Tej:

Comedian Prudhvi Raj Comments On Mega Hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs