Advertisement
Google Ads BL

బెల్లంకొండ వారబ్బాయికి మరో టాప్ భామ!


 

Advertisement
CJ Advs

బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్స్ ప్లాప్స్ తో పనిలేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. అతనికి దొరికే నిర్మాతలు కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే... నిర్మాతగా బెల్లంకొండ సురేష్.... శ్రీనివాస్ సినిమాలను నిర్మించే నిర్మాతలకు పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే. బయట నిర్మాతలు కొంత సొమ్ము పెడితే అధిక మొత్తం బెల్లంకొండ సురేష్ పెట్టి కొడుకుని స్టార్ హీరో చెయ్యాలని చూస్తున్నాడు. అందుకోసమే తెరంగేట్రం సినిమా నుండి అన్ని భారీగానే సమకూరుస్తున్నాడు. శ్రీనివాస్ కి అంత సీన్ లేకపోయినా భారీ నిర్మాతలు, భారీ అంటే టాప్ హీరోయిన్స్ వచ్చి వాలిపోతున్నారు.

మొదటి సినిమా నుండే టాప్ హీరోయిన్స్ ని కొడుకు కోసం తీసుకొస్తున్నాడు సురేష్. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇప్పుడు తాజాగా సాక్ష్యంలో పూజ హెగ్డే తో ఆడిపాడుతున్నాడు. ఎంతైనా టాప్ హీరోయిన్ పక్కన నటించడమనేది శ్రీనివాస్ అదృష్టమని చెప్పాలి. అటు దర్శకులు కూడా టాప్ రేంజ్ వాళ్లే. ఇక శ్రీనివాస్ సాక్ష్యం సినిమాని శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తుండగా... ఇప్పుడు తాజాగా ఒకటికి రెండు సినిమాలు కమిటయ్యాడు. అయితే ఈ సినిమాలు రెండు చిన్న స్థాయిలో ఉన్న దర్శకులతో చేస్తున్నవే. అందులో ఒక సినిమాకి యాంకర్ నుండి  డైరెక్టర్ గా ప్రమోట్ అయిన ఓంకార్ రూపొందించబోయేది. అందులో హీరోయిన్, అలాగే  ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.

మరోవైపు నాని అనే కొత్త దర్శకుడితో ఒక భారీ బడ్జెట్ సినిమానే చేయనున్నాడట బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా సెట్ అయ్యే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. మరి పెద్దగా ఫామ్ లో లేకపోయినా కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ శ్రీనివాస్‌తో జోడి కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి బెల్లంకొండ సురేష్ అండతో బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా వరుసగా టాప్ రేంజ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యడం చూస్తుంటే... అబ్బో అనిపిస్తుంది. ఇకపోతే సమంత, తమన్నా, రకుల్ కి భారీగా సమర్పించిన సురేష్ కాజల్ కి ఇంకెంత పారితోషకంగా సమర్పిస్తున్నాడో అంటూ ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Kajal to Romance Bellamkonda Sai Srinivas:

Kajal Charges a Bomb to Romance Him!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs