Advertisement
Google Ads BL

మొత్తానికి నాగశౌర్య.. సాధించేశాడు..!


నాగశౌర్య - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన 'ఛలో' సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నాగశౌర్య కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమాతో నాగ శౌర్య మంచి హిట్ అంటే తాను అనుకున్న హిట్ అందుకున్నాడు. ఓన్ బ్యానర్ లో తన తల్లి ఉష నిర్మించిన ఛలో హీరోగా మంచి మార్కులు కొట్టేయడమే కాదు.. పెట్టిన పెట్టుబడికి ధీటుగా వసూళ్లు చేపట్టి మంచి లాభాలు మూటగట్టుకునేలానే కనబడుతున్నాడు నాగశౌర్య. చాలా తక్కువ బడ్జెట్ లో రిచ్ గా నిర్మించిన ఈ సినిమా ఐరా క్రియేషన్స్ నుండి 6  కోట్లకు థియేటర్స్ రైట్స్ ని అమ్మారు.. అలాగే ఈ సినిమా పబ్లిసిటీ  విషయాల్లో ఛలో టీమ్ ఎక్కడా తగ్గకుండా కొత్తగా చేపట్టడంతో ఈ సినిమా విడుదలకు, మంచి టాక్ రావడానికి ప్లస్ అయ్యింది.

Advertisement
CJ Advs

అందులో ఛలో విడుదలైన రోజే రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమా విడుదలై నెగెటివ్ టాక్ రావడం కూడా నాగశౌర్యకి బాగా కలిసొచ్చింది. ఇకపోతే 6  కోట్ల థియేటర్స్ రైట్స్ ని అమ్మేసిన వీరికి ఆ మొత్తం లోని సగం కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టేసింది 'ఛలో' సినిమా. తొలిరోజే ఛలో సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 1.85 కోట్ల షేర్ వచ్చింది. సినిమా టాక్ పాజిటివ్ గా ఉండడంతో వసూళ్లు రెండో రోజు కూడా స్టడీగా ఉన్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి ఛలో పెట్టుబడిలో మూడువంతులు వసూలు చేసేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసేస్తున్నారు.

ఇక్కడ మాత్రమే ఛలో హవా లేదు.. అక్కడ ఓవర్సీస్ లో కూడా ఛలో సినిమా బాగానే కొల్లగొడుతుంది. నాగశౌర్య కెరీర్లోనే అత్యధికంగా 110   స్క్రీన్లలో ఓవర్సీస్ లో రిలీజైన ఈ సినిమా ప్రిమియర్లతో 94 వేల డాలర్లు.. శుక్రవారం 1.35 లక్షల డాలర్లు వసూలు చేసింది. శనివారం కూడా లక్ష డాలర్లకు పైనే కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం అయ్యేసరికి సినిమా 4 లక్షల డాలర్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరి అక్కడ ఓవర్సీస్ లో ఛలో బయ్యర్లు అప్పుడే బ్రేక్ ఈవెన్ కి వచ్చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఛలో సినిమా విజయంతో శౌర్య ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. 

Naga Shaurya scores big hit with Chalo:

Chalo all set to break into half a million dollar club
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs