Advertisement
Google Ads BL

అనిరుధ్ కి కెరియర్ పై అప్పుడే డౌట్..!!


పవన్ కళ్యాణ్ క్రేజ్ తో టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా పాతుకుపోదామని కలలు కనడమే కాదు.. ప్రత్యేకించి తనని తానే తెగ ప్రమోట్ చేసుకున్న కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. కానీ పవన్ క్రేజ్ కూడా అనిరుధ్ ని కాపాడలేకపోయింది. కారణం అనిరుధ్ తొలి తెలుగు సినిమా అజ్ఞాతవాసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. కనీసం అనిరుధ్ మ్యూజిక్ కి కూడా మంచి మార్కులు పడలేదు. కేవలం రెండు పాటలు మాత్రమే అజ్ఞాతవాసిలో బావున్నాయి. అయినా అజ్ఞాతవాసి హిట్ అయితే కనీసం ఆ రెండు పాటలు హిట్ అయినందుకైనా మనోడు అనిరుధ్ కి పేరొచ్చేది.

Advertisement
CJ Advs

కానీ సినిమా అట్టర్ ప్లాప్ వలన అనిరుధ్ కూడా డీలా పడడమే కాదు.. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోల్పోయాడనే టాక్ వుంది. అనిరుధ్ ప్లేస్ లోకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చాడని అంటున్నారు. ఇకపోతే తెలుగులో ప్లాప్ అయినా కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడనే విషయం అందరికి తెలిసిందే. మరి కోలీవుడ్ లో కెరీర్ ఎదురులేకుండా ఉన్నప్పటికీ.. అనిరుధ్ కేవలం ఫామ్ లో ఉన్నపుడే క్రేజ్ ఉంటుంది గాని... ఫామ్ లో లేనప్పుడు పరిస్థితి ఏమిటి అని ఆలోచించినట్లుగా వున్నాడు.

అందుకే కొంతమంది స్టార్స్ వలే అనిరుధ్ కూడా సైడ్ బిజినెస్ లోకి దూకేశాడు. అనిరుధ్ కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. సమ్మర్ హౌజ్ ఈటరి పేరుతో అనిరుధ్ చెన్నైలో ఈ బిజినెస్ మొదలు పెట్టేశాడు. ఈ చెన్నై బ్రాంచ్ గనక ఒకే అయితే తమిళనాడు మొత్తం కొత్త బ్రాంచీలు ఓపెన్ చేసి బిజినెస్ ని విస్తరించాలనేది ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆలోచన అంట. మరి కోలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం ఈ అనిరుధ్ కొత్త రెస్టారెంటుకు క్యూ కట్టారంటున్నారు.

Music Director Anirudh Starts A New Business:

Anirudh starts a new Summer House Eatery in Chennai <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs