Advertisement
Google Ads BL

'సాహో' పై ఈ డౌట్స్ మొదలైనాయ్!!


ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత ఏడాది జూన్ లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం భారీగా ఖరీదైన లొకేషన్స్ ని వాడుతున్నారు. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చే యోచనతో ఇప్పటికే బాలీవుడ్ నుండి హీరోయిన్ ని శ్రద్ద కపూర్ ని, విలన్స్ గా జాకీష్రాఫ్‌, మందిరాబేడీ, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ వంటి నటులకు సాహోలో చోటిచ్చారు.

Advertisement
CJ Advs

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ని పక్కగా ప్లాన్ చెయ్యడమే కాదు.. పర్ఫెక్షన్ కోసం అవసరమైతే రీషూట్‌ చేయడానికి సైతం మేకర్స్ రెడీగా వున్నారట.  అయితే సాహో సినిమా ఈ ఏడాది లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని దసరా నాటికి సినిమా విడుదలవుతుందని అన్నారు. కానీ ఈ సినిమా ఈ ఏడాది దసరాకి విడుదల కావడం లేదు. ఎందుకంటే సాహో షూటింగ్ లేట్ కావడం.... గ్రాఫిక్స్ వర్క్స్ కూడా త్వరగా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా 2019 సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయట. ఈ సినిమాకి ఒక వైపు షూటింగ్ మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పటికీ.. గ్రాఫిక్స్ మాత్రం అంత త్వరగా పూర్తికావంటున్నారు.

అయితే ప్రస్తుతం సాహో యాక్షన్ సన్నివేశాల కోసం సముద్రగర్భంతో పాటు ఏరియల్ షూట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ ఈమధ్యనే విదేశాలకు వెళ్లి మరి స్కూబా డైవింగ్‌కు సంబంధించి ట్రైనింగ్ తీసుకొన్నాడు. మరి ఇంత ప్రాసెస్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికైనా పూర్తవుతుందా అనేది పెద్ద డౌటే.

Saaho looks at Sankranthi 2019 for release:

Prabhas Saaho Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs