Advertisement
Google Ads BL

మన్మథుడు మామూలోడు కాదండోయ్..!


నాగార్జునని కొందరు ప్లేబోయ్‌గా గతంలో చెప్పుకునే వారు. ఐశ్వర్యారాయ్‌ నుంచి సుస్మితాసేన్‌, టబు, అనుష్క, చార్మి. ఇలా నాగ్‌ అడిగితే చిన్న పాత్రలోనైనా నటించే వారికి లోటు లేదు. వారిని అంతలా ఆయన ఆకట్టుకుంటాడు. ఇక ఈయన ఎంతో జెంటిల్‌మేన్‌ అని కూడా ఆయనతో నటించిన హీరోయిన్లందరూ కితాబునిస్తారు. అలా లేడీస్‌ ఫ్యాన్స్‌నే కాదు.. తోటి హీరోయిన్స్‌ని కూడా తన ఫ్యాన్స్‌ చేసుకోవడంలో నాగ్‌ బహు నేర్పరి. అందుకే ఆయనకు 'మన్మథుడు'అనే బిరుదు వచ్చింది. శ్రీదేవి నుంచి లావణ్య త్రిపాఠి వరకు అందరూ ఆయన ఫ్యాన్సే. ఇక ఈయన మాటలు చెప్పడంలో కూడా బహు నేర్పరిగా పేరు తెచ్చుకున్నాడు. తాత అయ్యే వయసులో, మామగా ఆల్‌రెడీ అయిపోయిన ఆయన తన కుమారుల కంటే అన్నివిషయాలలోనూ చాలా యాక్టివ్‌. 

Advertisement
CJ Advs

ఇక ఈయన ప్రస్తుతం 'శివ, అంతం, గోవిందా గోవిందా' తర్వాత రామ్‌గోపాల్‌వర్మతో ఓ చిత్రం చేస్తున్నాడు. దాని వెంటనే నానితో కలిసి ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కనుంది. ఇక వర్మ చిత్రంలో నాగ్‌కి మెయిన్‌ హీరోయిన్‌ అంటూ ఎవరూ లేరుగానీ ఓ కీలకపాత్రను కొత్తనటి మైరా సరీన్‌ పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మొదట్లో ఈ పాత్రను అనుష్క చేయనుందని వార్తలు వచ్చినా వర్మ సడన్‌గా మైరా సరీన్‌ని తీసుకుని వచ్చాడు. ఓ పార్టీలో ఆయన మైరా సరీన్‌ని చూసి నీకు యాక్టింగ్‌ మీద ఇంట్రెస్ట్‌ ఉందా? అని అడిగాడట. ఆ తర్వాత జరిగిన ఆడిషన్స్‌లో ఆమెలోని నటనా ప్రతిభను చూసి మైమరిచి పోయాడట. ఆమె నటన చూసి షాక్‌ తిన్నాను. ఆమె గొప్ప ఎక్స్‌ప్రెసివ్‌ అని పొగిడేశాడు. 

ఇక నాగార్జున ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతున్న సందర్భంగా మైరా సరీన్‌ చేతి రేఖలను చూసి నీవు సినిమాలలో స్టార్‌వి అయిపోతావని జ్యోతిష్యం చెప్పాడట. దానికి ఎంతో మురిసిపోయిన ఆమె ఆ విషయాన్నిబయటపెట్టింది. మొత్తానికి 'రాజు గారి గది 2' తర్వాత నాగ్‌లో నిజంగా రుద్ర లక్షణాలు వచ్చాయనే సెటైర్లు బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం టైటిల్‌ని 'శపథం'( మై రివేంజ్‌ కంప్లీట్‌) అనే పేరు పరిశీలనలో ఉంది. 

king Nagarjuna is Predicting The Future of Myra Sareen:

Rgv Selects Myra Sareen Telugu Debut With Nagarjuna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs