చట్టం అందరి మీదా ఒకే విధంగా పనిచేయదు. బలహీనుల మీద బలంగా, బలవంతుల మీద బలహీనంగా పనిచేస్తుంది. ఈ విషయం సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసులోనే స్పష్టమైంది. ఇప్పుడు మరో బాలీవుడ్ ఖాన్, కింగ్ ఖాన్‌గా పేరున్న షారుక్‌ఖాన్ పేరు బయటికి వచ్చింది. ఆయన ఐటీ అధికారుల కళ్లు కప్పి భారీ ఆస్థిని కూడబెట్టుకున్న కేసు సంచలనం సృష్టిస్తోంది. 20 వేల గజాల ఆలీబాగ్ ప్లాట్స్‌ని షారుఖ్‌ఖాన్ నకిలి దృవపత్రాలు చెల్లించి కొనుగోలు చేశాడని ఆయన కింద చార్టెర్ట్ అకౌంటెంట్‌గా పనిచేసే మోరేశ్వర్ అజ్గాంకరే స్వయంగా ఉన్నతాధికారుల వద్ద ఒప్పుకున్నాడు. షారుఖ్ వ్యవసాయ అవసరాల నిమిత్తం ఈ ప్లాట్స్‌ని నకిలి పత్రాలతో కొనుగోలు చేశాడు.
అయితే దానిని వ్యవసాయ విషయాలకు ఉపయోగించకుండా, ఖరీదైన ఫామ్‌హౌస్ నిర్మాణంతో పాటు వాటికి తన బంధువులను డైరెక్టర్స్‌గా నియమించి సర్వాధికారాలను తానే చెలాయిస్తున్నాడు. ఈ ఆస్థి విలువ 15కోట్లకు పైగానే ఉంటుందని, మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ విలువ మరో పదింతలు ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో స్విమ్మింగ్‌పూల్, బీచ్, హెలిప్యాడ్ వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ని ఐటి శాఖ ప్రస్తుతానికి అటాచ్ చేసింది.
ఈ నేరం రుజువైతే షారుఖ్‌ఖాన్‌కి ఆరునెలల నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష, ఆస్థి విలువలో ౧౦ శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా షారుఖ్ సామాన్యమైన వ్యక్తి కాదు. ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి. దాంతో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతారే గానీ చివరకు ఏదో విధంగా షారుఖ్ ఈ కేసు నుంచి బయటపడటం ఖాయమనే చెప్పాలి.