Advertisement
Google Ads BL

రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో న్యూస్‌!


రాజమౌళి దానయ్య నిర్మాతగా అక్టోబర్‌ నుంచి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌ని రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ కూడా సిద్దం చేశాడని, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు అన్నాదమ్ముళ్లుగా నటిస్తారని, బాక్సింగ్‌ నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి 'ఇద్దరు ఇద్దరే' అనే టైటిల్‌ని కూడా అనుకుంటున్నారని వార్తలను వండివారుస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం కేవలం ఎన్టీఆర్‌, చరణ్‌లతో ఫొటో తీసుకుని పోస్ట్‌ చేయడం తప్ప ఇప్పటివరకు ఈ చిత్రం విషయంలో నోరు విప్పలేదు. 

Advertisement
CJ Advs

కానీ సాయిధరమ్‌తేజ్‌ మాత్రం నిజమేనని తేల్చాడు. 'జవాన్‌' సమయంలో ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌ కూడా నటిస్తాడని వార్తలు వస్తే వాటిని తేజు ఖండించాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌ కూడా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. గతంలో రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌లు కలిసి 'ఎవడు' అనే చిత్రంలో నటించాడు. ఇక అల్లుఅర్జున్‌ ఈ మల్టీస్టారర్‌లో నటిస్తాడనే విషయంలో ఏ విధమైన ఆధారాలు లేవు. దాంతో ఇది నిజమేనా? కాదా? అనే ఆసక్తి కూడా మొదలైంది. ఇక ఇందులో మాస్‌ మహారాజా రవితేజ విలన్‌గా నటిస్తాడని వార్తలు కూడా వస్తున్నాయి. రవితేజ తాజాగా తన ఫ్యాన్స్‌తో రాజమౌళితో సినిమా ఎప్పుడు అంటే త్వరలోనే అనిచెప్పాడు. విలన్‌గా నటిస్తారా? ఎన్టీఆర్‌, రామచరణ్‌ చిత్రంలో విలన్‌ మీరే అటగా అని అడిగితే కాదని చెప్పి, అయినా ఐడియా బాగుందని చెప్పాడు. 

మొత్తానికి రాజమౌళి గానీ మరో ఎవరైనా గానీ అఫీషియల్‌గా స్పందించే వరకు ఇలాంటి వార్తలు మరెన్నో పుట్టుకొస్తాయి. మరి వీటికి ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి...! అయితే ఈ చిత్రంలో ఓ స్టార్‌ హీరోనే విలన్‌గా నటిస్తాడని, అతనెవ్వరో మాత్రం తెలియదని మాత్రం కొందరు నమ్మకంగా చెబుతున్నారు. ఇలా ఈ చిత్రం ఇంకా మొదలు కాకముందు నుంచే రోజుకో వార్త దీనిపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయనే చెప్పవచ్చు.

Another Rumour on Ss Rajamouli Multistarrer :

Allu Arjun in SS Rajamouli Multistarrer movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs