Advertisement
Google Ads BL

మెగాకోడలిని నిద్రపోనివ్వని 'భాగమతి'....!


మొత్తానికి ఈ ఏడాది టాలీవుడ్‌లో మొదటి సూపర్‌హిట్‌ చిత్రంగా 'భాగమతి' నిలిచింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓవర్‌సీస్‌లో కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంటోంది. బయ్యర్లకు, నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టిన ఈ ఏడాది మొదటి చిత్రంగా 'భాగమతి' నిలిచింది. లేడీ ఓరియంటెండ్‌ పాత్రలో అదరగొట్టే అనుష్క నటన, ఆమెకు చెప్పిన డబ్బింగ్‌, తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, టెక్నికల్‌ వ్యాల్యూస్ వంటివి ప్రేక్షుకులను బాగా అలరిస్తున్నాయి. దీంతో మరో మూడు నాలుగేళ్లు హీరోయిన్‌గా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని అనుష్కకి లేదనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

ఇక 'పిల్ల జమీందార్‌' తప్ప మరో పెద్ద హిట్‌ లేని దర్శకుడు అశోక్‌కి, యువి క్రియేషన్స్‌కి తమ బేనర్‌లో గొప్పగా చెప్పుకోదగిన చిత్రంగా 'భాగమతి' నిలవడం ఖాయం. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు చూసి అభినందనలు కురిపిస్తున్నారు. సినిమా ఏదైనా, ఎవరిదైనా తనకు నచ్చితే సినిమా చూసి అభినందించడం, సినిమా విడుదలకు ముందే బెస్టాఫ్‌లక్‌ చెప్పడంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ముందుంటాడు. ఇదే ఆయనకి మంచి అభిమానులను, సినీ పరిశ్రమలోని అందరికీ ప్రీతిపాత్రుడుని చేసింది. ఈయన 'బాహుబలి' సమయంలో టీంకి అభినందనలు చెప్పడంతో పాటు మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' సమయంలో కూడా మహేష్‌కి ఆకాశానికి ఎత్తి పొగడ్తలు గుప్పించాడు. 

ఇక ఈయన తాజాగా తన భార్య ఉపాసనతో కలిసి 'భాగమతి' స్పెషల్‌షోని వీక్షించాడు. వెంటనే ఈ చిత్రం అద్భుతంగా ఉందని, టెక్నికల్‌ టీంకి, అద్భుతమైన నటన కనబరిచిన అనుష్కకి అభినందనలు చెబుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ చిత్రం చూసిన తర్వాత తన భార్య ఉపాసనకి రాత్రంతా భయం వల్ల నిద్ర పట్టలేదని చెబుతూ, తనకి నిద్ర లేకుండా చేసిన మూవీకి థ్యాంక్స్‌ చెబుతూ ఆయన చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొత్తానికి ఈమధ్య కాలంలో ప్రతి విషయంలోనూ మన యంగ్‌ హీరోలు పాజిటివ్‌గా రెస్పాన్స్‌ అవుతుండటం చూస్తే మార్పు మంచికేనని చెప్పాలి. 

Ram Charan Comments on Anushka shetty's Bhagmati Movie:

Ram Charan Wife Upasana Shocking Comments on Bhaagamathie movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs