Advertisement
Google Ads BL

బయ్యర్లు భయపడొద్దు: అజ్ఞాతవాసి నిర్మాత!!


పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. నిర్మాత రాధాకృష్ణ ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. విడుదలైన ఫస్ట్ షోకే ఈ సినిమాకి వచ్చిన టాక్ చూసిన బయ్యర్లు భయపడిపోయారు. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజుకే బిషానా ఎత్తేసే పరిస్థితికి వచ్చేసింది. త్రివిక్రమ్ వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టరేనా ఈ సినిమా తీసింది అనుకునేలా ఉందా అజ్ఞాతవాసి సినిమా.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా డైరెక్షన్ లో హీరోగారు అంటే పవన్ కళ్యాణ్ చేతులు పెట్టడం వలెనే ఈ సినిమాకి ఈ గతి పట్టింది అనేవారు లేకపోలేదు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయినప్పటికీ నిర్మాత సినిమాని ముందే అమ్మేసి సేఫ్ అయ్యాడు కానీ.. బయ్యర్లకే ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది. భారీ అంటే దాదాపుగా 60 % ఈ సినిమాతో బయ్యర్లు నష్టపోయారు. అసలు అజ్ఞాతవాసి సినిమా కనీసం నాలుగు రోజులు బాగా ఆడినా బయ్యర్లు గట్టెక్కేవారే. కానీ ఈ సినిమా మొదటి షోకే భారీ డిజాస్టర్ అన్న టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. అయితే నష్టపోయిన బయ్యర్లకు నిర్మాత రాధాకృష్ణ ఎంతోకొంత సాయం చెయ్యాలని ముందుకు వచ్చాడంటున్నారు. తన సినిమా 125 కోట్లకు అమ్ముడు పోయినందున  ఒక 25 కోట్లు నష్టపోయిన బయ్యర్లకు ఇవ్వాలని అయన నిర్ణయించుకున్నాడట. 

మరి 60% నష్టపోయిన వారికి కనీసం 20% నష్టాలను అయినా పూడ్చడానికి నిర్మాత ముందుకు రావడం శుభపరిణామం అంటున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన పారితోషకంలో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చెయ్యాలనే నిర్ణయంతో ఉన్నాడంటున్నారు. చూద్దాం ఈ మొత్తంతో అజ్ఞాతవాసి బయ్యర్లు ఎంత సేఫ్ అవుతారో అనేది.

S Radhakrishna Promise to Save Agnyaathavaasi Distributors:

Producer S Radhakrishna taking care of Agnyaathavaasi distributors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs