రాజమౌళి సినిమా కేరెక్టర్ అనగానే ఎగిరిగంతేశాల ఉంది ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితి. రాజమౌళి సినిమాల్లో ఏ పాత్ర అయినా అంత బలంగా ఉంటుంది అనేది బాహుబలితో ప్రూవ్ అయ్యింది. అందుకే రాజమౌళి నా సినిమాలో ఒక కేరెక్టర్ చేస్తావా అని అడగ్గానే ఒప్పేసుకుంటున్నారు ఆర్టిస్టులు అందరూ. ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ లో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ హీరోలిద్దరు పోలీస్ పాత్రల్లో కనబడతారనే సమాచారం ఉంది. గ్రాఫిక్స్ కి దూరంగా బలమైన కథ, కథనంతో ఈ సినిమాకి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఇంత పవర్ ఫుల్ స్టోరీలో ఆ ఇద్దరు స్టార్ హీరోలకు విలన్ గా ఒక టాలీవుడ్ హీరో నటించబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మల్టీస్టారర్ లో హీరోలకు ధీటైన విలన్ గా రాజమౌళి తో విక్రమార్కుడు సినిమా చేసిన రవితేజ నటించబోతున్నాడని... ఇప్పటికే రాజమౌళి రవితేజాతో సంప్రదింపులు జరిపినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు ఎనర్జిటిక్ హీరోగా దూసుకుపోతున్న రవితేజ మొదటిసారి విలన్ రోల్ చేస్తే ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని... రాజమౌళి భావిస్తున్నాడట. మరి రాజమౌళి ఇలా అడగగానే రవితేజ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడనే టాక్ కూడా వినబడుతుంది.
మరి హీరోగా మంచి ఫామ్ లో ఉన్న రవితేజ, ఇలా రాజమౌళి కోసం విలన్ అవతారం ఎత్తడం మాత్రం సూపర్ అంటున్నారు రవితేజ అభిమానులు. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విలన్ విషయం అధికారికంగా ప్రకటించే వరకు సస్పెన్స్ అంటున్నారు కొందరు.