Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, చరణ్.. ఎవరూ తక్కువకాదు..!!


రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటేనే హీరోలకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అసలు రాజమౌళి పిలవాలి గాని కథ గురించి గాని అందులోని తమ పాత్రల గురించి గాని తమకి అనవసరం అన్నట్టుగా ఉన్నారు స్టార్ హీరోలు. ఎందుకంటే రాజమౌళి అంత టాలెంట్ ఉన్న దర్శకుడు. కెరీర్ లో ఒక్క ప్లాప్ లేకుండా దూసుకుపోతున్న రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ హీరోలతో ఒక మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. జస్ట్ ఒక్క ఫొటోతో అందరి మనసుల్లో ఆలోచనలు రేకెత్తించిన రాజమౌళి ఈ సినిమాపై ఎక్కడ ఎటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

రాజమౌళినే కాదు ఆ ఇద్దరు స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్ గానీ, ఎన్టీఆర్ గానీ ఎక్కడా  తాము మల్టీస్టారర్ సినిమాలో చేయబోతున్నామని చెప్పనే లేదు. అయినా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించి ఫిక్స్ అయ్యిపోయింది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేస్తున్నాడట. ఇద్దరు స్టార్ హీరోలలో ఏ ఒక్క హీరో పాత్ర తక్కువ ఎక్కువ కాకుండా ఈ స్క్రిప్ట్ ని పక్కాగా చెక్కుతున్నాడట. మరి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చెయ్యడం అంటే కత్తి మీద సాములాంటిదే. అందులో భాగంగానే స్టోరీ లైన్‌ ఓకే అయిపోయినా కానీ స్క్రీన్‌ప్లే పరంగా ఈ బ్యాలెన్స్‌ కోసం రాజమౌళి చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందట. అలాగే చరణ్ కి తారక్ కి సమానమైన రోల్‌ వుండేలా, నటన పరంగా కూడా ఇద్దరికీ సమానమైన స్కోప్‌ వుండేలా రాజమౌళి కథనానికి పదును పెడుతున్నాడట.

తన పనితనం మెచ్చి అడగగానే డేట్స్ కేటాయించిన చరణ్ కి తారక్ ఇద్దరికీ రాజమౌళి తగిన న్యాయం చెయ్యాలని బాగానే కష్టపడుతున్నాడట. ఏ హీరో అభిమానులు కూడా నిరాశ పడకుండా ఈ సినిమా ఉండబోతున్నదనే టాక్ వినవబడుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో మొదలు పెట్టి వచ్చే ఏడాది చివరిలో విడుదల చెయ్యడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి గ్రాఫిక్స్ ని టచ్ చేయకుండా హీరోలకు యాక్షన్ తక్కువ కాకుండా రాజమౌళి ఈసినిమాని ఎలా తియ్యబోతున్నాడో అనే క్యూరియాసిటీ మాత్రం అందరిలో రోజురోజుకి పెరిగిపోతుంది.

Rajamouli giving Equal Importance to Charan and NTR:

Ram Charan Teja and Jr NTR in SS Rajamouli's next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs