ఎవరు ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాకపోయినా కూడా పవన్‌కళ్యాణ్ 'జనసేన' పార్టీ మాత్రం గెలుపు ఓటములను నిర్దేశించడంలో కీలక పాత్రను పోషించనుంది. ఆయన పార్టీకి పడే ఓట్లే మిగిలిన వారి గెలుపును నిర్ణయిస్తాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం, అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చిరు చీల్చాడు. దాంతోనే వైఎస్ రెండోసారి గెలవగలిగాడు. నాటి ఎన్నికల్లో పిఆర్పీపికి పడిన ఓట్లు చంద్రబాబుకి తక్కువగా పడిన ఓట్లును పోల్చుకుంటే ఇది స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో బిజెపి మీద ఉన్న ఆగ్రహం వల్ల వామపక్షాలు కూడా ప్రభావశీలమైన పాత్రను పోషించడం ఖాయం. అదే సమయంలో టిడిపి, జనసేన, వామపక్షాలు కలిస్తే మాత్రం అది టిడిపికి వరంగా మారినట్లేనని చెప్పాలి.
ఇక జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం తమ పార్టీ మీద ఉండదని, చంద్రబాబు వ్యతిరేక ఓట్లను పవన్ చీలుస్తాడనే అభిప్రాయంతో ఏకీభవించలేదు. జనసేన పోటీ చేసినా తమకొచ్చే నష్టం ఏమీ లేదని తేల్చాడు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు మోదీ, పవన్‌లు ప్రచారం చేసినా తమకు టిడిపికి కేవలం ఐదు లక్షల ఓట్లు తేడానే ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. మరి పవన్.. చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషించకుండా, మరోవైపు వైసీపీని కూడా దెబ్బకొట్టకుంటే ఇక పవన్ రాజకీయాలలోకి వచ్చినందువల్ల ఏమీ ఉపయోగం లేదు.
మరి జగన్ ఏ అంచనాలతో, ఏ లెక్కలతో అలా చెబుతున్నాడో తెలియదు గానీ బహుశా బహుమేధావి అయిన ప్రశాంత్ కిషొర్ కేవలం తమకు పవన్ అంటే భయంలేదని ప్రజలకు సంకేతాలిచ్చేందుకే జగన్ చేత ఆ మాట చెప్పిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి పవన్ ఓటు బ్యాంకుని మాత్రం చిన్నచూపు చూస్తే ఒక్క ఓటు చాలు కీలకమైన ఎన్నికల్లో మితిమీరిన విశ్వాసం తీవ్ర చేటునే చేస్తుందని చెప్పడానికి.