Advertisement

సి.కళ్యాణ్‌ - దిల్‌రాజుల మధ్య వాదోపవాదం!


ఫిబ్రవరి 9వ తేదీన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌-వివి వినాయక్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'ఇంటెలిజెంట్‌', బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌తేజ్‌ల 'తొలిప్రేమ' రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని భావించారు. ఈ రెండు సినిమాలకు బోలెడు ప్లస్‌ పాయింట్స్‌తో పాటు మైనస్‌ పాయింట్స్‌ కూడా ఉన్నాయి. ఒకవైపు దిల్‌రాజు సాయిధరమ్‌తేజ్‌ శ్రేయాభిలాషి. కానీ ఆయన వరుణ్‌తేజ్‌ నటించిన 'తొలిప్రేమ' చిత్రం థియేటికల్‌ రైట్స్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ కథ తానే చేయాల్సిందని కానీ 'ఫిదా' బిజీ వల్ల చేయలేకపోయానని, దాంతో ఈ చిత్రాన్ని తానే రిలీజ్‌ చేస్తున్నానని దిల్‌రాజు ప్రకటించాడు. మరోవైపు సాయిధరమ్‌తేజ్‌కి కొంతకాలంగా సరైన హిట్‌ లేదు. వినాయక్‌ పరిస్థితి కూడా అంతే. 'ఖైదీనెంబర్‌ 150' ఆడినా అది రీమేక్‌ కావడం, సక్సెస్‌ క్రెడిట్‌ చిరుకి వెళ్లింది. 

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో సాయితో వినాయక్‌తో కలిపి ఏకంగా 32 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రం చేయడం అంతే సాహసమే. అది సి.కళ్యాణ్‌ చేశాడు. మరోవైపు 'ఫిదా'తో 50కోట్ల క్లబ్‌లో చేరడం, పాటలు, ట్రైలర్‌ అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం, యూత్‌కి నచ్చే లవ్‌స్టోరీ కావడం 'తొలిప్రేమ'కి ప్లస్‌. అయితే 'తొలిప్రేమ' అనే టైటిల్‌, కొత్త దర్శకుడు కావడం, బివీఎస్‌ఎన్‌ ప్రసాద్‌కి వరుసగా పరాజయాలు పలకరిస్తూ ఉండటం మైనస్‌గా చెప్పాలి. ఒక చిత్రం చూసి బయటకి వచ్చిన మెగాఫ్యాన్స్‌కి వెంటనే రెండో చిత్రం రిజల్ట్‌ తెలిసిపోతే కలెక్షన్లకు దెబ్బే. అయితే 'తొలి ప్రేమ' చిత్రం లవ్‌ రొమాంటిక్‌ మూవీ కావడంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం ఉండటం దీనికి కలిసి వస్తుంది. 

ఇక ఈ చిత్రం విడుదల విషయంలో సి.కళ్యాణ్‌కి, దిల్‌రాజుకి పెద్ద వాగ్వాదమే జరిగిందట. దాంతోనే చివరకు దిల్‌రాజు కాస్త వెనక్కి తగ్గి ఒకరోజు వెనుకగా ఫిబ్రవరి 10న రానున్నాడు. ఇక పోటీ వల్ల ఎంత నష్టమో దిల్‌రాజుకి 'ఎంసీఏ' చిత్రంతో తెలిసి వచ్చింది. అయినా ఒకరోజు కాకుండా కనీసం ఓ వారం అయినా గ్యాప్‌ తీసుకుని ఉంటే ఇరు చిత్రాలకు బాగుండేదని అంటున్నారు. 

C Kalyan Intelligent vs Dil Raju Tholiprema:

Clash between Tholiprema and Intelligent Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement