Advertisement
Google Ads BL

ప్రభాస్‌ సరసన ఆమె? ఆధారాలు చూపిస్తోంది....!


'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నేషనల్‌ స్టార్‌గా, నేషనల్‌ ఐకాన్‌గా ఎదిగాడు. ఆయనతో నటించడానికి బాలీవుడ్‌ హీరోయిన్లు కూడా సిద్దంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం శ్రద్దాకపూర్‌తో 'సాహో' చిత్రం చేస్తున్న ఆయన 'జిల్‌' రాధాకృష్ణ చిత్రం కోసం సారా అలీఖాన్‌ని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌11 ద్వారా పాపులర్‌ అయిన యువతి హర్షిఖాన్‌. బిగ్‌బాస్‌లో పలు సంచనాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె తాజాగా తాను ప్రభాస్‌తో నటించ నున్నానని చెప్పి షాక్‌ ఇచ్చింది. ఎందరో టాప్‌ హీరోయిన్స్‌ ఉండగా ఈమెని ఎలా పెట్టుకుంటారు? ఏదో పబ్లిసిటీ కోసం అలా అంటోందని అందరూ భావించారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆమె మాట్లాడుతూ, చీప్‌ పబ్లిసిటీ కోసం ఇలా చెప్పుకునే అవసరం నాకు లేదు. బిగ్‌బాస్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి తెలుగు నిర్మాతలు ముంబై వచ్చి నన్ను కలిశారు. తమ చిత్రంలో నటించమని కోరారు. ఇంతకీ నటీనటులు ఎవరు అని ఆరాతీస్తే ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నాడని తెలిపారు. తర్వాత అగ్రిమెంట్స్‌ మీద కూడా సైన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా మూడు నాలుగు సార్లు వారు నాతో ఫోన్‌లో టచ్‌లో ఉంటూనే ఉన్నారు అని చెప్పుకొచ్చింది. 

ఇక ఈ చిత్రం టైటిల్‌ 'రిటర్న్‌ ఆఫ్‌ రెబెల్‌ 3' అని, ఈ అగ్రిమెంట్‌లో దర్శకుడు మెహర్‌ రమేష్‌ అని ఉండటం చూసి కొంపతీసి 'బిల్లా' తర్వాత మరోసారి ప్రభాస్‌ మెహర్‌ రమేష్‌తో చిత్రం చేయనున్నాడా? అని షాక్‌ తింటున్నారు. మరి ఈ విషయంలో ఎవరో ఒకరు నోరు విప్పితే గానీ నిజాలు బయటకు రావు. 

Arshi Khan signs a film With Prabhas:

'Bigg Boss 11' contestant Arshi Khan signs a Prabhas film?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs