రామ్‌చరణ్ ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా ఉన్నాడు. ఆయన శ్రీమతి ఉపాసన సైతం అపోలో ట్రస్ట్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూనే తన భర్తకి సంబందించిన విషయాలను సోషల్ మీడియాలో పెడుతూ ఎంతో యాక్టివ్‌గా ఉండి అభిమానులను ఎంకరేజ్ చేస్తోంది. ఇక ఇప్పటివరకు మనకి రామ్‌చరణ్‌ని ఆయన శ్రీమతి ఉపాసన మిస్టర్ సి అని ముద్దుగా పిలుస్తుందని తెలుసు. ఇక తాజాగా ఉపాసన తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియాను పోస్ట్ చేసింది. ఈ వీడియా మెగాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
దీనిలో తన భర్త మిస్టర్ సి తనకి లంచ్ కావాలని ఎలా అడుగుతాడో చూడమని ఉపాసన వీడియోని పెట్టింది. రామ్‌చరణ్ మొహానికి ఓ బొమ్మని అడ్డం పెట్టుకుని 'ఉప్స్ గారండీ.. చిట్టిబాబుకి ఆకలేస్తోందండి' అని సరదాగా మాట్లాడాడు. దీనిని బట్టి రామ్‌చరణ్‌ని ఉపాసన మిస్టర్ సి అని పిలిస్తే రామ్‌చరణ్ తన శ్రీమతి ఉపాసనను ఉప్స్ అని ముద్దుగా పిలుస్తాడని అర్ధమవుతోంది. మరోవైపు తనను తాను రంగస్థలం చిత్రంలోని హీరో పాత్రధారి పేరైన చిట్టిబాబుకి ఆకలేస్తోంది అని చెప్పడం ద్వారా ఈ చిత్రం ప్రమోషన్‌కి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.
మొత్తానికి ఈ సరదా వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక 'రంగస్థలం 1985'కి త్వరలో పూజాహెగ్డేతో తీసే స్పెషల్ సాంగ్ అనంతరం గుమ్మడికాయ కొట్టి మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.