నిన్న బుధవారం నటి అమలా పాల్ అరెస్ట్ బెయిల్ అనే అంశాలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. పన్ను ఎగ్గొట్టే క్రమంలో తన కారుని పక్క రాష్ట్రం పుదిచ్చేరిలో కొన్నట్లుగా తప్పుడు పత్రాలు చూపించి ఆదాయపు పన్ను వారిని తప్పుదోవ పట్టించిందని అమలా పాల్ ని నిన్న బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా అమల పాల్ ఈ కారు వ్యవహారంలో రోజు మీడియాలో నానుతూనే ఉంది. నిన్నటికి నిన్న పోలీసులు అరెస్ట్ చెయ్యడం వెంటనే బెయిల్ రావడంతో అమల తన తదుపరి కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది.
అయితే అమలా పాల్ నిన్న బుధవారం అరెస్ట్ బెయిల్ తో హైలెట్ అయితే సాయంత్రానికల్లా తనని ఓ బిజినెస్ మ్యాన్ లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మలేషియాలో జరగబోయే ‘డాన్సింగ్ తమిళచ్చి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమలా పాల్ ఒక డాన్స్ స్కూల్ లో కొరియో గ్రాఫర్ సమక్షంలో డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది. ఆ క్రమంలో డాన్స్ స్కూల్ ఓనర్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన అళగేశన్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధించాడని అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చెన్నై నగరు శివారు ప్రాంతమైన కొట్టివక్కమ్‌కి చెందిన బిజినెస్‌మేన్ అళగేశన్.. తనతో చాలా అసభ్యంగా, నీచంగా, అశ్లీలంగా వ్యవహరించాడని అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. అయితే వెంటనే స్పందించిన పోలీసులు అళగేశన్ ను అదుపులోకి తీసుకున్నారు.