Advertisement
Google Ads BL

పెళ్లిపై శృతి ఫుల్ క్లారిటీ ఇచ్చింది!


కమల్‌హాసన్‌ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్‌ శృతిహాసన్‌. ఈమె సంగీత దర్శకురాలే గాదు మంచి సింగర్‌ కూడా. ఇక ఈమెకి తన ట్రూప్‌లో భాగంగా లండన్‌కి చెందిన మైఖేల్‌కోర్స్‌లేతో ఎఫైర్‌ ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయినా తన ప్రేమ గురించి ఆమె మాటల్లో ఎక్కడా చెప్పకపోయినా తన చేతల్లో మాత్రం అన్నింటిని చూపించేస్తోంది. తాను తరచు తన బోయ్‌ఫ్రెండ్‌ కోసం లండన్‌కి వెళ్లడం, వీలున్నప్పుడు అతను ముంబైకి వస్తుండటంతో వీరిద్దరు కలిసి ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ తీసుకుని సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఆమద్య ఆయన ముంబైకి వచ్చిన సందర్భంగా సంతోషం ఆపుకోలేక ఎయిర్‌పోర్ట్‌లోనే కౌగిలింతలు, లిప్‌లాక్‌లు చేసి కారులోకి ఎక్కి కూడా నానా హంగామా చేసింది. ఇక ఈమె తన ప్రియుడు మేఖేల్‌ కోర్స్‌లేని తన తండ్రి కమల్‌హాసన్‌కి, తన తల్లి సారికాకి కూడా పరిచయం చేసేసింది. ఈమద్య ఆయన కమల్‌, శృతిలతో కలిసి తమిళ సంప్రదాయ దుస్తులైన తెల్లని పంచె, ధోవతిలతో ఓ పెళ్లికి కూడా హాజరయ్యాడు. దీంతో త్వరలో వీరి వివాహం ఖాయమని అందుకే ఆమె కొత్తగా చిత్రాలు ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. 

'గబ్బర్‌సింగ్‌'తో ఫామ్‌లోకి వచ్చిన ఈమె 'కాటమరాయుడు'లో కనిపించిన ఫిజిక్‌ తీవ్ర విమర్శలకు దారితీసింది. మరో వైపు అన్ని అనుకున్నంతలో 'సంఘమిత్ర' నుంచి బయటకి వచ్చింది. ఇక ఈ ఏడాది తాను మూడు ఆల్బమ్స్‌ని విడుదల చేయాలని భావిస్తున్నానని, తన జీవితం అంటే కేవలం నటనే కాదని ఆమె సెలవిచ్చింది. బర్త్‌డే ఫొటోస్‌తో తన ప్రియుడితో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసిన ఆమె నేను పెళ్లి చేసుకోవడం లేదు. నాకు పెళ్లి చేయాలని ఆరాటపడుతున్న మీ ప్రయత్నాలు ఇకనైనా ఆగుతాయని భావిస్తున్నాను. ఇక ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం ఉంది.. అని తెలిపింది. 

ఇక ఈమె రీల్‌ లైఫ్‌లో కూడా కమల్‌హాసన్‌కి కూతురుగా నటిస్తోన్న 'శభాష్‌నాయుడు' చిత్రం షూటింగ్‌ ఎంతవరకు వచ్చింది? అసలు 'భారతీయుడు2' దెబ్బకి అది ఉంటుందా? లేదా? అనేది కూడా అర్ధం కావడం లేదు.

Shruti Haasan on her affair, marriage:

<span>About marriage, it is funny that people are planning all the things for me without really knowing about me, Shruti laughed off.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs