Advertisement
Google Ads BL

వర్మకి షకీలా సూపర్ ఆఫర్ ఇచ్చింది..!


తాజాగా టాలీవుడ్‌ దర్శకుడు అజయ్‌ కౌండిన్య మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే నటిరోజా ఒప్పుకుంటే ఆమెతో 'గాడ్‌సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' పార్ట్‌2 తీస్తానని సంచలన  వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు వర్మ తన జీఎస్టీని చూసి మహిళల నుంచి కూడా పొగడ్తలు వస్తున్నాయని అంటున్నాడు. మరోవైపు తాను పైరసీకి వ్యతిరేకం కాదని, పైరెటెడ్‌ మూవీస్‌ తాను కూడా చూస్తానని వర్మ చెబుతుండే వాడు. దీనికి తగ్గట్లుగా 150రూపాయల టిక్కెట్‌ పెట్టిన 'జీఎస్టీ' పైరసీ లింక్‌లు ఇప్పుడు స్వైర విహారం చేస్తున్నాయి. దీని షూటింగ్‌ కోసం వర్మ పెట్టిన విమాన ఖర్చులు కూడా వచ్చి ఉండవనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇక నిన్నటితరంలో పెద్దల చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన మలయాళ నటి షకీలా. ఈమె మలయాళంలో బాగా పాపులర్‌ అయినప్పటికీ ఈమెది నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రాంతం. నాడు మలయాళంలో ఈమె చిత్రం రిలీజ్‌ అవుతోందంటే పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా తమ చిత్రాలు రిలీజ్‌ డేట్స్‌ని మార్చుకునే వారు. ఒకానొక సమయంలో ఆమె చిత్రాలపై బ్యాన్‌పెట్టాలని కూడా ప్రయత్నించారు. ఇక అక్కడి చిత్రాలు తెలుగులోకి కూడా డబ్‌ అయి కలెక్షన్ల వర్షం కురిపించేవి. ఇక ఈమె షుగర్‌, బిపీ,చైన్‌ స్మోకింగ్‌, ఒబేసిటీ కారణంగా తీవ్ర అనారోగ్య కారణాలతో సతమతమవుతూ కూడా కొన్ని తెలుగు చిత్రాలలో నటించింది. 

తాజాగా ఆమె వర్మ 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' చిత్రం రెండో పార్ట్‌ని తనతో తీస్తానంటే సంతోషంగా ఒప్పుకుంటానని చెప్పింది. వర్మ వంటి దర్శకుడు నన్ను అడిగితే ఎలా కాదనగలను? అయితే నేను 30కిలోలు బరువు తగ్గి స్లిమ్‌గా కావాలని ఆయన కండీషన్‌ పెడితే మాత్రం నాకు బరువు తగ్గేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుందని నవ్వుతూ చెప్పింది. మొత్తానికి వర్మ తీసిన 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' సెగలు ఇంకా చల్లారలేదని దీని గురించి పది మంది పది విధాలుగా మాట్లాడుతుంటే అర్ధమవుతోంది. అందుకే ఆయన వర్మ కాగలిగాడు...! 

Shakeela Ready to GST 2:

Shakeela Bumper Offer to Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs