Advertisement
Google Ads BL

బన్నీ, చైతూలే ఈ భామని కాపాడాలి!


'మజ్ను' చిత్రంతో ప్రేక్షకులకి పరిచయమైన నాటికి టీనేజర్ అయిన అను ఇమ్మానుయేల్ అనతి కాలంలోనే తెలుగులోనే అతి పెద్ద స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. 'అజ్ఞాతవాసి' చిత్రం జరుగుతున్న రోజులలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చొరవతో హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో నాగ చైతన్య అక్కినేని నటించబోయే చిత్రంలో బెర్త్ ఖరారు చేసుకున్నప్పటికీ తదుపరి అవకాశాలపై అమ్మడి ట్రాక్ రికార్డు భారీగానే ప్రభావం చూపుతోంది.

Advertisement
CJ Advs

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి' ఇలా వరుస వైఫల్యాలతో డీలా పడిపోయిన అను ఇమ్మానుయేల్ ముందుగా త్రివిక్రమ్-తారక్ ల కాంబినేషన్ లో చిత్రానికి కథానాయిక పేర్లలో పరిశీలనకు వచ్చినప్పటికీ ఇప్పుడు అను వైపు తారక్ అసలు మొగ్గు చూపటం లేదు. అలానే పవన్ కళ్యాణ్ సినిమాలో చేసిన భామని పెట్టుకుని సినిమాలు మార్కెట్ చేసుకుందాం అనుకున్న చిన్న నిర్మాతలు కూడా ఇప్పుడు అనుని అసలు పట్టించుకోవటం లేదు. పాపం అను ఇమ్మానుయేల్ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ కి దర్శకుడు, హీరోలకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు ఈ భామని అల్లు అర్జున్, నాగ చైతన్యలే కాపాడాలి.

Anu Emmanuel Future in Dilemma :

Anu Emmanuel Future in Allu Arjun and Naga Chaitanya Hands
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs