Advertisement
Google Ads BL

ఇక సాయిపల్లవి సర్దుకోవడమే బెటర్!


మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న సాయి పల్లవి తెలుగులో 'ఫిదా'తో కత్తిలాంటి అమ్మాయి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి పోటీకి దిగిందని అనుకున్నారు అంతా. అనుకున్నట్లుగానే సాయి పల్లవి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోయింది. అమ్మడుకి ఎంతగా పేరొచ్చిందో అంతే బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. 'ఫిదా' సినిమా టైం లో గమ్మునున్న ఈ పోరి నాని 'ఎంసీఏ' నాటికి పూర్తిగా మారిపోయిందని టాక్ బయటికొచ్చింది. 'ఎంసీఏ' సినిమా టైం లో నానితో గొడవ పడిందని.. సినిమా షూటింగ్ కి లెట్ గా వచ్చిందని అబ్బో సాయి పల్లవి గురించి చాలా వార్తలే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అలాగే కోలీవుడ్ లో కూడా సాయి పల్లవి మీద కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి. నాగశౌర్యని.. సాయి పల్లవి 'కణం' సినిమా అప్పుడు బాగా ఇబ్బంది పెట్టిందనే న్యూస్ కూడా వినబడింది. నాగశౌర్య అయితే బహిరంగంగానే సాయి పల్లవి షూటింగ్ కి లేట్ గా వస్తుందని... ఆమెకి కాస్త ఈగో ఉందని చెప్పాడు.

Advertisement
CJ Advs

ఇన్ని రూమర్స్ వచ్చాక సాయి పల్లవి మీద తెలుగు  ప్రేక్షకుల్లో బ్యాడ్ ఇంప్రెషన్ మొదలవుతుందనుకుందో ఏమో.. తెలుగు సినిమాల్లో నటించడానికి  వెనకాడుతుంది సాయి పల్లవి. అందుకే ఏ ఒక్క తెలుగు సినిమాని ఒప్పుకోకుండా కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అయితే కోలీవుడ్ లో తాను అనుకున్నట్లుగానే తన అభిమాన హీరో సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది. మెయిన్ హీరోయిన్ గా సాయి పల్లవి, సెకండ్ హీరోయిన్ గా రకుల్ ఈ సినిమాలో సూర్య పక్కన నటిస్తున్నారు.

అయితే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న సినిమా సెట్ లో కూడా హీరోయిన్ సాయి పల్లవి వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని కోలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్ హల్చల్ చేస్తుంది. హీరో సూర్యతో కాంబినేషన్ సీన్లు లేని డేట్స్ లో బాగా ట్రబుల్ ఇస్తూ షూటింగ్ కి ఆలస్యంగా వస్తోందని దర్శకుడు సెల్వ రాఘవన్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. మరి ఒక్కసారి ఇలాంటి న్యూస్ బయటికొస్తే రూమర్ అనుకోవచ్చు, కానీ పదే పదే సాయి పల్లవి మీద ఇలాంటీ న్యూస్ బయటికొస్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనేది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ.

Complaints on Sai Pallavi Also in Kollywood:

Sai Pallavi Troubles Directors?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs